Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నయా మూవీ ఆ సినిమాకు రీమేక్ కాదట.. అసలు విషయం ఏంటంటే

|

Feb 01, 2023 | 8:54 AM

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ నయా మూవీ ఆ సినిమాకు రీమేక్ కాదట.. అసలు విషయం ఏంటంటే
Pawan Kalyan
Follow us on

పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఆయన అభిమానులు ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. త్వరలో పవన్ హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో నిధిఅగార్వల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత  యంగ్ డైరెక్టర్ సుజీత్ తో ఒక భారీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ కోసం చేతులు కలుపుతున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటన వచ్చింది. సుజీత్ రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 2022 లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొంది, ప్రతిష్టాత్మక ఆస్కార్స్ కి సైతం నామినేట్ అయిన ‘ఆర్ఆర్ఆర్’ వంటి సంచలన విజయం తర్వాత డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రమిది.

ఇక ఈ సినిమా తమిళ్ లో దళపతి విజయ్ నటించిన పోలీసోడు సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ఉంటుందని టాక్. అయితే ఈ సినిమాలో ఫైట్లు, పాటలు ఉండవని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అర్హ కూడా నటిస్తోందని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కంప్లీట్ గా కొత్త స్టోరీ అని అంటున్నారు. దళపతి విజయ్ తేరి సినిమాలో ఫైట్స్ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా ఆ సినిమా రీమేక్ కాదు అని అంటున్నారు. సుజిత్ కొత్త స్టోరీతో పవన్ సినిమాను తెరకెక్కించనున్నడని.. ఇందుకోసం ఒక డిఫరెంట్ స్టోరీని రెడీ చేసుకున్నాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలిసియాల్సి ఉంది.