Pawan Kalyan: కష్టంలో, సుఖంలో తోడునీడగా ఉండే ఒక నిజమైన స్నేహితుడు ఉంటే చాలు అలాంటి స్నేహితుడిని పొందిన జీవితం అని అందరూ చెబుతారు. అలాంటి స్నేహితులను చూస్తే.. ఎవరికైనా నచ్చుతారు. సినీ పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ల ఫ్రెండ్ షిప్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఒకరు మనసు అయితే ఇంకొకరు తనువు అన్నట్లు వ్యవహరిస్తారు. వీరిద్దరి స్నేహం గురించి.. వీరి బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. వీరిని విడదీసి చూడడం అనేది జరగని పని కాదు. నిజానికి పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువమంది స్నేహితులున్నారు. ఆనంద్ సాయి (Anand Sai) , త్రివిక్రమ్ ఇలా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్స్ ను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు అని అంటారు. అయితే పవన్ ఫ్రెండ్స్ లో త్రివిక్రమ్ వెరీ వెరీ స్పెషల్. పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినకపోయినా త్రివిక్రమ్ మాట వింటాడనే టాక్ ఉంది. వీరిద్దరూ తమ స్నేహ బంధం గురించి అనేక సందర్భాల్లో బహిరంగంగానే చెబుతారు. తమకు ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను, అభిమానాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటారు.
హైదరాబాద్ లో జరిగిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తన స్నేహితుడు త్రివిక్రమ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు త్రివిక్రమ్ ల మధ్య చాలా విషయాల్లో అభిప్రాయాలూ ఒకేలా ఉంటాయని.. అయితే ఒక విషయంలో మాత్రమే తేడా వస్తుందని చెప్పారు. అవును ఒక్క పుస్తకాల విషయంలోనే మా ఇద్దరి మధ్య తేడాలు వస్తాయి. ఇద్దరం పుస్తకాల పురుగులమే… ఏదైనా పుస్తకం చదవడం మొదలు పెడితే.. అది పూర్తి అయ్యేవరకూ వదిలి పెట్టం. ఇటీవల జరిగిన ఒక సంఘటన పంచుకున్నారు. నా దగ్గర ఉన్న పుస్తకాల్లో ఒకటి త్రివిక్రమ్ కు నచ్చి ఇవ్వమని అడిగితే నేను అస్సలు ఇవ్వలేదు. కావాలంటే ఒక సినిమా ఫ్రీగా అయినా చేస్తాను కానీ ఆ పుస్తకం మాత్రం ఇవ్వను” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పవన్ చేరిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
ఇక పవన్ , త్రివిక్రమ్ బాటలోనే పిల్లలు కూడా నడుస్తున్నారు. అకిరా హైదరాబాద్ వస్తే, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంట్లోనే గడుపుతాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనయుడు రిషి మనోజ్, అకిరా ప్రాణ స్నేహితులు. వీరిద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా, తరచూ ఫోన్ లో ముచ్చట్లాడుకుంటారు. అంతేకాదు పవన్ కొడుకుని త్రివిక్రమ్ కూడా ఎంతో అపురూపంగా చూస్తాడట. అకిరా హైదరాబాద్ వస్తే మాత్రం రిషి మనోజ్ తో కలిసి ఎంతో అల్లరి చేస్తారట.