
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తోన్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మరింత ఆసక్తిగా సాగుతోంది. రెట్టింపు ఉత్సహంతో బాలయ్య ఈ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు బాలయ్య. ఈ క్రమంలోనే చాలా మంది సినిమా సెలబ్రెటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులూ కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బాలయ్య షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ ను రెండు భాగాలుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా టీమ్. మొన్నామధ్య మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అవ్వగా.. తాజాగా సెకండ్ పార్ట్ కూడా స్ట్రీమింగ్ చేశారు. ఇదిలా ఉంటే సెకండ్ పార్ట్ లో ఎక్కువగా రాజకీయాలపైనే డిస్కస్ చేశారు పవన్ , బాలయ్య.
కాగా ఈ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చే విషయం పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. అలాగే తన దృష్టిలో రాజకీయం అనే ఏంటో తెలిపారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పాలిటిక్స్‌లో విమర్శను స్వీకరించాలి అనే మాటను కూడా చిరంజీవి జీవితం నుండి నేర్చుకున్నాను అని అన్నారు పవన్ కళ్యాణ్
అలాగే ప్రజలకు అండగా ఉండేలా అధికారం ఉండాలి అన్నారు పవన్. ప్రజల్ని ఇబ్బంది పెట్టే, సమస్యల్లోకి నెట్టే ప్రభుత్వాలు ఉండకూడదని కోరుకుంటుంటాను. ఆ క్రమంలో అధికారం వస్తుందో రాదో నాకు తెలియదు. నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్లడమే నాకు తెలిసిన పని. అదే చేస్తున్నా.. అన్నారు పవన్ కళ్యాణ్.