Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

గబ్బర్ సింగ్’ వంటి సంచలన విజయం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికలో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే
Pawan Kalyan

Updated on: Mar 16, 2026 | 10:01 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు, రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో హరీష్, పవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా ఇంతపెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ కు రాజకీయాల్లోకి రావచ్చుగా అంటూ సలహా ఇచ్చారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాశీ మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

సినిమా షూటింగ్ సమయంలో భాగంగా పవన్ కళ్యాణ్ తనతో ఓసారి మాట్లాడుతూ తన గురించి అడిగి తెలుసుకున్నారు అని తెలిపింది. సినిమాల్లోకి రాకపోతే ఏం చేసేవారు అని పవన్ అడగ్గా.. తాను ఐఏఎస్ అవ్వాలనుకున్నాను కానీ అది కుదరని నేపథ్యంలోనే సినిమాలోకి వచ్చాను అని రాశీ ఖన్నా తేలిందట.. దాంతో పవన్  ఐఏఎస్ కుదరకపోతే రాజకీయాలలోకి రావచ్చు కదా.. ఇలాగైనా ప్రజలకు సేవ చేయొచ్చు కదా అంటూ తనకు సలహాలు ఇచ్చారని రాశిఖన్నా చెప్పుకొచ్చింది. పవన్ కళ్యాణ్ ఆహ్వానించారు కానీ తనకు రాజకీయాల పై ఆసక్తి లేదు అని తెలిపింది రాశీ. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us