Oscars 2023: ఆస్కార్‌కు ఇండియా నుంచి బరిలో ఉన్న సినిమాలేంటి… ఇవిగో పూర్తి వివరాలు

|

Jan 25, 2023 | 1:02 PM

ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న ఆస్కార్స్ నామినేషన్స్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది. అభిమానులు కలలు కంటున్న ఎన్టీఆర్ పేరు అయితే బెస్ట్ యాక్టర్ లిస్టులో మిస్ అయింది.. కానీ ఇండియా నుంచి మూడు నామినేషన్స్ రావడం ఈ సారి గర్వించదగ్గ విషయం. మరి ఆస్కార్ బరిలో భారతదేశం నుంచి బరిలో ఉన్న సినిమాలేంటి.. షార్ట్ ఫిల్మ్స్ ఏంటి..?

Oscars 2023: ఆస్కార్‌కు ఇండియా నుంచి బరిలో ఉన్న సినిమాలేంటి... ఇవిగో పూర్తి వివరాలు
A still from the song Naatu Naatu
Follow us on

ట్రిపుల్ ఆర్ మళ్లీ చరిత్ర సృష్టించింది. 15 రోజుల కింద గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో నాటు నాటు పాట దుమ్ము దులిపేసింది. అప్పట్నుంచి ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌లోనూ ఈ పాట కచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతుందని నమ్మారు ట్రిపుల్ ఆర్ యూనిట్. అన్నట్లుగానే ఈ పాట ఇప్పుడు భారతదేశం తరఫున ఆస్కార్స్‌కు నామినేట్ అయింది నాటు నాటు సాంగ్. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఈ పాట నామినేట్ అయింది. ట్రిపుల్ ఆర్‌తో పాటు మరో రెండు నామినేషన్స్ కూడా ఇండియా నుంచి అధికారికంగా ఎంట్రీ ఇచ్చాయి. మొదటిసారి ఇండియా నుంచి మూడు నామినేషన్స్ రావడంతో పండగ చేసుకుంటున్నారు సినీ అభిమానులు. మార్చ్ 12న ఈ అవార్డు ప్రధానోత్సవం జరగనుంది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ది ఎలిఫెంట్ విష్పరర్స్.. డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ నామినేట్ అయ్యాయి.

షార్ట్ ఫిల్మ్స్ కేటగిరీలో ఉన్న 5 నామినేషన్స్‌లో ఒకటి ఇండియా నుంచి ఉంది. తమిళనాడు బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ది ఎలిఫెంట్ విష్ఫరర్స్.. అలాగే డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ కేటిగిరీలో ఆల్ దట్ బ్రీత్స్ ఉన్నాయి. ఈ రెండింట్లో కచ్చితంగా ఒకదానికి ఆస్కార్ రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. అదే జరిగితే ఇండియా ఈ సారి ఆస్కార్‌లో చరిత్ర సృష్టించినట్లే.

ఆస్కార్‌ నామినేషన్స్‌లో ఇండియా సత్తా చూపించినా.. ఒక్క విషయంలో మాత్రం అందరికీ నిరాశే ఎదురైంది. అదే ఎన్టీఆర్ ఎంట్రీ.. కొన్ని రోజులుగా ఆస్కార్ బెస్ట్ యాక్టర్ లిస్టులో యంగ్ టైగర్ ఉంటారని అభిమానులు ఆశ పడ్డారు. పైగా సోషల్ మీడియాలోనూ దీనిపై ఎక్కువగా ట్రెండింగ్ జరిగింది. ఆస్కార్ ఫర్ ఎన్టీఆర్ అంటూ బాగానే హడావిడి చేసారు ఫ్యాన్స్. ఆయన మిస్ అవ్వడం మినహాయిస్తే.. మిగిలిందంతా హ్యాపీసే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..