టాలీవుడ్ లో యాంకర్ గా రాణించిన ముద్దుగుమ్మల్లో అందాల అనసూయ ఒకరు. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అయిన జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ భామ. ఆ తర్వాత సినిమాల్లో కీలక పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే అనసూయ చాలా సినిమాల్లో కనిపించి మెప్పించింది. రంగస్థలం సినిమానుంచిమొదలు పెట్టి ఇప్పటివరకు చాలా సినిమాల్లో కనిపించి మెప్పించింది. రీసెంట్ గా ప్రేమ విమానం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇక అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాగే తన పై వచ్చే ట్రోల్స్ కు నెట్టింట గట్టిగానే సమాధానం చెప్తూ ఉంటుంది అనసూయ. ఈ భామ ఇప్పటికే పలు కాంట్రవర్సీలోనూ ఇరుకున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవర కోసం పై ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టి న్యూస్ లో నిలిచింది. దాంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయ పై ఫైర్ అయ్యారు. ఓ రేంజ్ లో ఆమె పై ట్రోల్స్ చేశారు. అయినా కూడా అనసూయ వెనకాడుగు వేయకుండా అందరికి గట్టిగానే సమాధానం చెప్పింది. ఇక నెటిజన్స్ చేసే కామెంట్స్ కూడా రిప్లే ఇస్తూ ఉంటుంది ఈ హాట్ బ్యూటీ.
తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది అనసూయ. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పాత హీరోయిన్స్ మాదిరిగా ముస్తాబయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు. నెటిజన్స్ .. “చాలా అందంగా ఉన్నారు. అచ్చం సావిత్రి గారిలా ఉన్నారు” అంటూ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ ‘ఎక్స్‌పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే’ అని కామెంట్ చేశాడు. దానికి అనసూయ స్పందిస్తూ.. ‘చాలా కరెక్ట్‌గా చెప్పారండీ.. సావిత్రి గారిలా నటించడం ఎవరి తరంకాదు. నేను ట్రిబ్యూట్ ఇచ్చానంతే. అలాగే ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా అంత తేలిక కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చేయాలి’ అంటూ రాసుకొచ్చింది అనసూయ.
I feel fortunate to have been given this opportunity to give a tribute to these legendary actresses through my performance.. 😇🙏🏻#Savithramma #JamunaGaru #SrideviGaru #SoundaryaGaru
Don’t miss #ZeeKutumbamAwards2023 this evening #6pmOnwards only on @zeetelugu ❤️ pic.twitter.com/S1HDmgUkrD
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.