Viral Video: సినిమా ప్రమోషన్స్‌లో స్టార్ హీరోపై చెప్పు దాడి.. అతని రెస్పాన్స్ ఇదే..

|

Dec 19, 2022 | 3:29 PM

కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన తదుపరి చిత్రం ‘క్రాంతి’ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆయనపైకి ఓ వ్యక్తి చెప్పు విసిరాడు. ఆ చెప్పు దర్శన్ భుజానికి తగిలింది.

Viral Video: సినిమా ప్రమోషన్స్‌లో స్టార్ హీరోపై చెప్పు దాడి..  అతని రెస్పాన్స్ ఇదే..
Kannada actor Darshan hit with a slipper at Kranti event
Follow us on

కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురయ్యింది. కర్నాటక లోని హోస్పేటలో క్రాంతి సినిమా ప్రమోషన్‌లో ఉన్న దర్శన్‌పై చెప్పు దాడి జరిగింది. ఓ వ్యక్తి చెప్పు విసరడంతో దర్శన్‌ భుజానికి తగిలింది. కొద్దిరోజుల క్రితం మహిళలను కించపర్చే విధంగా విమర్శలు చేసినట్టు దర్శన్‌పై ఆరోపణలు వచ్చాయి. మహిళలను కించపర్చారని దర్శన్‌పై చెప్పుదాడి జరిగినట్టు తెలుస్తోంది. ‘‘అదృష్ట దేవతే స్వయంగా ఇంటికి వస్తే వెంటనే ఆమెను దుస్తులు విప్పి ఇంట్లో బందీ చేయాలి. ఎందుకంటే మీరు ఆమెకు బట్టలు ఇచ్చేస్తే.. ఆమె వేరే చోటికి వెళ్ళిపోతుంది’’ అని ఇటీవల ఆయన చేసిన కామెంట్స్‌పై మహిళలు భగ్గుమన్నారు.


కొద్దిరోజుల క్రితం దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌పై కూడా దర్శన్‌ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.  ‘‘నా ఫ్యాన్స్ నన్ను ఎంతగానో అభిమానిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పునీత్‌ను తీసుకోండి.. ఆయన మరణించిన తర్వాత అమితమైన ప్రేమ చూపిస్తున్నారు. కానీ, నేను బతికి ఉండగానే ఫ్యాన్స్‌ ప్రేమను చూరగొటున్నాను’’ అని ఓ ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు.  పునీత్‌ అభిమానులు కూడా అప్పటి నుంచి దర్శన్‌ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.

గతంలో కూడా పలు వివాదాల్లో ఇరుక్కున్నారు దర్శన్‌. చెప్పు దాడి తరువాత నో ప్రాబ్లమ్‌ బ్రదర్‌ అంటూ స్పందించారు దర్శన్‌.  కోపంగా ఉన్న తన అభిమానులను శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. చెప్పు విసిరిన వ్యక్తిని ఏమీ చేయవద్దని కోరాడు.  వెంటనే పోలీసు రక్షణ మధ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు. జనవరి 26న క్రాంతి సినిమా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి వి హరికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శన్ సరసన రచితా రామ్ నటిస్తోంది. ఒక దశాబ్దం క్రితం తన భార్యపై దాడి చేశాడనే ఆరోపణలపై దర్శన్ అరెస్ట్ అయినప్పుడు కూడా వార్తల్లో చక్కర్లు కొట్టాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.