Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ ఈ పెద్దాయన చేసిన పని చూస్తే.. నెట్టింట వీడియో వైరల్..

ఇప్పుడు థియేటర్లలో సక్సెస్‏ఫుల్ గా రన్ అవుతున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా అలాంటిదే. ఉద్యోగం, ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని మరిచి.. యూత్‏తో కలిసి ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటున్నారు మూవీ లవర్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ మూవీలో టిల్లు పంచులకు.. యాక్టింగ్ చూసి ఖుషి అవుతున్నారు.

Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ ఈ పెద్దాయన చేసిన పని చూస్తే.. నెట్టింట వీడియో వైరల్..
Tillu Square, Anupama

Updated on: Mar 31, 2024 | 1:50 PM

ఉరుకుల పరుగుల జీవితానికి కాసేపు ఉపశమనం కలిగించేది సినిమా. దాదాపు రెండు గంటలు ప్రేక్షకులను థియేటర్లలో కూర్చొబెట్టి కడుపుబ్బా నవ్వించడమంటే చిన్న విషయం కాదు. జీవితంలోని కష్టాలు, బాధలు మర్చిపోయి.. ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా ఉండాలంటే ఓ మంచి సినిమా చూడాల్సిందే. హారర్ కంటెంట్.. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కాకుండా.. మనసుకు ఉత్సాహన్ని కలిగించే కామెడీ ఎంటర్టైనర్స్ చూసేందుకు జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు థియేటర్లలో సక్సెస్‏ఫుల్ గా రన్ అవుతున్న టిల్లు స్క్వేర్ సినిమా కూడా అలాంటిదే. ఉద్యోగం, ఫ్యామిలీ టెన్షన్స్ అన్ని మరిచి.. యూత్‏తో కలిసి ఎంజాయ్ చేయాలంటే ఈ సినిమా చూడాల్సిందే అంటున్నారు మూవీ లవర్స్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. ఈ మూవీలో టిల్లు పంచులకు.. యాక్టింగ్ చూసి ఖుషి అవుతున్నారు.

తాజాగా టిల్లు స్క్వేర్ సినిమా చూస్తూ ఓ పెద్దాయన తెగ సిగ్గు పడిపోయాడు. వయసును మర్చిపోయి కుర్రాళ్లతో కలిసి ఈ మూవీ చూస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఆ వీడియో.. కుర్రాళ్లతో కలిసి టిల్లు స్క్వేర్ సినిమా చూసేందుకు వచ్చిన ఓ పెద్దాయన.. మూవీలో అనుపమ, సిద్ధూ జొన్నలగడ్డ మధ్య వచ్చే ఓ రొమాంటిక్ సన్నివేశం ప్లే అవుతుంది. సరిగ్గా అప్పుడే అనుపమ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ చూసి కుర్రాడిలా మారిపోయాడు. ఆ రొమాంటిక్ సీన్ చూసి సిగ్గుపడుతూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అతడి పక్కన ఉన్న కుర్రాళ్లు పెద్దాయన ఎక్స్ ప్రెషన్స్ వీడియో తీసి నెట్టింట షేర్ చేయగా తెగ వైరలవుతుంది. ఆ వీడియోకు నెటిజన్స్ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.

డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈసినిమాకు అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మొదటి రోజు రూ. 23 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. నిన్న ఒక్కరోజే రూ. 21 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 45 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి.. విజయవంతంగా దూసుకుపోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us