లిరిక్స్ లో బూతులు.. అసభ్యకరమైన సీన్లు.. మంగ్లీ పాటపై యూట్యూబ్ సంచలన నిర్ణయం

కన్నడ సినిమా 'KD'లోని ఓ పాట ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇందులోని లిరిక్స్ తో పాటు సన్నివేశాలు చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంగనా రనౌత్ తదితర సినీ, రాజకీయ ప్రముఖులు ఈ పాటను తొలగించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

లిరిక్స్ లో బూతులు.. అసభ్యకరమైన సీన్లు.. మంగ్లీ పాటపై యూట్యూబ్ సంచలన నిర్ణయం
Sarke Chunar Teri Sarke song

Updated on: Mar 18, 2026 | 6:16 AM

బాలీవుడ్ నటి నోరా ఫతేహి , నటుడు సంజయ్ దత్ నటించిన కొత్త సాంగ్ సర్కే చునార్ తేరి సర్కే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ పాటలోని సాహిత్యం, దృశ్యాలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని తీవ్ర వ్యతిరేకత రావడంతో, దీని హిందీ వెర్షన్ ( సర్కే చునార్ తేరీ ) యూట్యూబ్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించారు. అర్జున్ జన్య స్వరకల్పనలో, మంగ్లి పాడిన ఈ పాట తీవ్ర విమర్శలకు గురైంది. పాటలోని పదాలు మహిళలను చెడుగా చిత్రీకరిస్తున్నాయని చాలామంది ఫిర్యాదు చేశారు. ఈ పాట కొరియోగ్రఫీపై నెటిజన్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. నోరా ఫతేహి పదేపదే చీరను పైకి కిందకి దించుతూ, పైకి తీస్తూ ఉండే సన్నివేశాలు అసభ్యకరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ సాంగ్ కాంట్రవర్సీ సోషల్ మీడియాకే పరిమితం కాకుండా న్యాయస్థానానికి కూడా చేరింది.

ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఈ పాటపైఔ సెన్సార్ బోర్డుకు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ పాట మైనర్లకు అందుబాటులో ఉన్నందున, భారత శిక్షా స్మృతిచ పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ పోలీసుల సైబర్ సెల్‌లో విడిగా ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ చిత్ర బృందానికి నోటీసు జారీ చేసింది. గాయకుడు అర్మాన్ మాలిక్, నటి కంగనా రనౌత్, క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు ‘సర్కే చునార్ తేరి సర్కే ‘ పాటలోని సాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం ( మార్చి 17)న ఈ పాట హిందీ వెర్షన్‌ను యూట్యూబ్ నుంచి తొలగించారు.

హిందీ వెర్షన్‌ను తొలగించినప్పటికీ, కన్నడతో సహా ఇతర దక్షిణ భారత భాషల్లో ఈ పాట ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. మరి వాటిని కూడా తొలగిస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా ఉంది. ఈ సాంగ్ వివాదంపై స్పందించిన గీత రచయిత రకీబ్ ఆలం, ‘నేను కన్నడ పాటను హిందీలోకి అనువదించాను.. అంతే కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదు’ అని వివరణ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us