
సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్. చాలా మనది సినీసెలబ్రెటీలు గత ఏడాది, ఈ ఏడాది మొదట్లో పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే తెలుగుతో పాటు హిందీ లోనూ కొంతమంది పెళ్లిపీటలెక్కారు. ఆగే కొంతమంది మాత్రం లవ్ ఎఫైర్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. చాలా సెల్సబ్రేటీలు తమ కో స్టార్స్ తో లవ్ ట్రాక్ నడిపిన వారు చాలా మంది ఉన్నారు. అయితే బ్రేకప్ బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రేమ జంటలు పెళ్లి పీటల వరకు వచ్చి బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు.
తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా స్కిన్ షోకు నో చెప్పిన ఈ బ్యూటీ.. ఆతర్వాత తన గ్లామర్ తో కవ్వించింది. సడన్ గా తన లవర్ ను పరిచయం చేసి ఫ్యాన్స్ గుండెల్లో ముల్లు గుచ్చింది ఈ చిన్నది. సర్లే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందని అంతా అనుకునే లోగా బ్రేకప్ చెప్పుకున్నారు. దాంతో సినిమాలకి చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణించాలని చూస్తుంది. ఆ అమ్మడు ఎవరో కాదు.. అందాల భామ నివేదా పేతురాజు.
ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా చేస్తూనే సెకండ్ హీరోయిన్ గానూ మెప్పించింది నివేదా పేతురాజు. అలాగే విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమాలో తన గ్లామర్ తో కవ్వించింది. అయితే ఈ అమ్మడు ఆ మధ్య సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అనౌన్స్ చేసి.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. బ్రేకప్ చెప్పుకున్నారు. ఇంస్టాగ్రామ్ నుండి ప్రియుడుతో ఉన్న ఫోటోలను తొలగించి విడిపోతున్నాం అంటూ హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు రాణించాలని చూస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.