Priya prakash varrier: రాత్రికి రాత్రే నా జీవితంలో ఊహించని మార్పు వచ్చింది.. ఆ గుర్తింపును మార్చుకుంటా అంటోన్న వింకిల్‌ గాళ్‌..

|

Feb 23, 2021 | 12:20 PM

Priya prakash varrier About Her Viral Video: ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను..

Priya prakash varrier: రాత్రికి రాత్రే నా జీవితంలో ఊహించని మార్పు వచ్చింది.. ఆ గుర్తింపును మార్చుకుంటా అంటోన్న వింకిల్‌ గాళ్‌..
Follow us on

Priya prakash varrier About Her Viral Video: ఒక చిన్న కన్నుగీటే సన్నివేశంతో యావత్‌ భారతదేశాన్ని తనవైపు తిప్పుకుంది కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఇంకా చెప్పాలంటే కేవలం ఒక్క రాత్రిలోనే సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకుందీ బ్యూటీ. ‘ఓరు ఆదర్‌ లవ్‌’ సినిమాలోని సెకన్ల వ్యవధిలో ఉన్న ఆ వీడియో అప్పట్లో నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఇక ఈ వీడియో వైరల్‌ అయిన తర్వాత ప్రియాకు సినిమా అవకాశాలు వరుసపెట్టి క్యూ కట్టాయి. టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు ప్రియాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అయితే ప్రియా మాత్రం ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటోంది. తెలుగులో ఎప్పటి నుంచో అవకాశాలు వస్తోన్నా.. ఇటీవల నితిన్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘చెక్‌’ సినిమాకు ఓకే చెప్పిందీ బ్యూటీ. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా విడుదల దగ్గర పడుతోన్న నేపథ్యంలో ప్రియా ప్రకాశ్‌ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు ముచ్చటించింది. ఈ క్రమంలోనే తను సెలబ్రిటీ హోదాను పొందడానికి కారణమైన వైరల్‌ వీడియోపై ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ”లవర్స్‌డే’ చిత్రంలోని కన్నుకొట్టే సన్నివేశం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో నా జీవితంలో ఊహించని మార్పు చోటుచేసుకుంది. డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రోజుల్లో.. ఈ వీడియో వైరల్‌గా మారింది. అప్పటిదాకా స్నేహితులతో కలిసి కాలేజీకి, బయటకీ వెళ్లి సరదాగా గడిపిన నేను ఎక్కడికి వెళ్లాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిది. మొదట్లో ఇది ఇబ్బందిగా అనిపించినా.. తర్వాత ఇదంతా నేను ఎంచుకున్న వృత్తిలో భాగమే అని అర్థమైంది. ఇప్పటికీ నన్ను వింక్‌ గాళ్‌ అనే పిలుస్తుంటారు. ఆ గుర్తింపు నా అదృష్టమే కానీ, ఇక నుంచి నా నటనతో ఆ పేరు మార్చుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

Also Read: రవితేజ, త్రినాధ రావు మూవీ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. మాస్ మాహారాజాకు జోడిగా ఆ ఇద్దరు హీరోయిన్లు..