Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య వివాహ వేడుక.. భార్యతో కలిసి ఇటలీకి పయనమైన టాలీవుడ్ హీరో..

|

Oct 28, 2023 | 11:10 AM

కొద్ది రోజుల క్రితం భార్య ఉపాసన, కూతురు క్లింకారతో ఇటలీ వెళ్లిన రామ్ చరణ్..తన సోదరుడి వివాహనికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. నవంబర్ 1న వరుణ్, లావణ్య పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 30 నుంచి మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీతోపాటు.. లావణ్య కుటుంబ సభ్యులు.. సన్నిహితులు ఇటలీకి చేరుకున్నారు. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హజరుకాబోతున్నట్లు తెలుస్తోంది.

Varun Tej-Lavanya Tripathi: వరుణ్, లావణ్య వివాహ వేడుక.. భార్యతో కలిసి ఇటలీకి పయనమైన టాలీవుడ్ హీరో..
Varun Tej, lavanya tripati
Follow us on

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కొద్ది రోజుల క్రితం భార్య ఉపాసన, కూతురు క్లింకారతో ఇటలీ వెళ్లిన రామ్ చరణ్..తన సోదరుడి వివాహనికి సంబంధించిన పనులను దగ్గరుండి చూసుకుంటున్నారు. నవంబర్ 1న వరుణ్, లావణ్య పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 30 నుంచి మెహందీ, సంగీత్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే మెగా ఫ్యామిలీతోపాటు.. లావణ్య కుటుంబ సభ్యులు.. సన్నిహితులు ఇటలీకి చేరుకున్నారు. ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది ప్రముఖులు మాత్రమే వీరి పెళ్లికి హజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హీరో నితిన్ తన సతీమణి షాలినితో కలిసి ఇటలీ వెళ్లారు.

నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరగనున్న వరుణ్, లావణ్య వివాహానికి నితిన్, షాలిని హజరుకానున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నితిన్, షాలిని హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇటీవల అల్లు అర్జున్ నివాసంలో జరిగిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రెషన్లలోనూ నితిన్ పాల్గొన్నారు. ఇక వరుణ్, లావణ్య వివాహనికి అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హజరుకానున్నట్లు సమాచారం. మరోవైపు అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజు ఇటలీకి వెళ్లనున్నారు. వీరిద్దరు తమ పెళ్లి వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మనీష్ డిజైనర్ స్టూడియోను సందర్శించిన వీడియో నెట్టింట వైరలయ్యింది. సెలబ్రెటీ స్టైలిస్ట్ లు అశ్విన్ మావ్లే, హసన్ ఖాన్ వీరి పెళ్లి వేదికను డిజైన్ చేయనున్నారు.

చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు.. ఇప్పుడు ఇరువురు కుటుంబసభ్యుల అంగీకారంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ ఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు నవంబర్ 1న వీరు ఏడడుగులు వేయబోతున్నారు. వరుణ్, లావణ్య మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో కలిసి నటించారు. మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.