AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ..

ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్..ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తెగ బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అన్ని టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాలే ఉన్నాయి. అందులో ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ సినిమా ఒకటి.  అయినా నెట్టింట మాత్రం సందడి చేస్తుంటుంది. క్రేజీ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఎవరో గుర్తుపట్టరా .

Tollywood: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ ముద్దుగుమ్మ..
Actress
Rajitha Chanti
|

Updated on: Oct 28, 2023 | 10:22 AM

Share

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్..ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తెగ బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ ఈ బ్యూటీకి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో అన్ని టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాలే ఉన్నాయి. అందులో ఇప్పుడు మోస్ట్ వెయిటెడ్ సినిమా ఒకటి.  అయినా నెట్టింట మాత్రం సందడి చేస్తుంటుంది. క్రేజీ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. ఎవరో గుర్తుపట్టరా .. తనే హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం తెలుగులో నాలుగైదు సినిమాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా మీనాక్షి లేటేస్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో ఓ క్రేజీ పిక్ పైన మీరూ చూస్తున్నారు. మీనాక్షి చౌదరి.. 1996 మార్చి 5న హార్యానాలో జన్మించింది. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ కోర్సు చేసింది.

ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది. మయన్మార్, యాంగోన్ లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో అందాల పోటీలో మొదటి రన్నరప్ గా టైటిల్ అందుకుంది. ఆ తర్వాత ఫెమినా మిస్ ఇండియా 2018లో పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని అందుకుంది. 2018 మిస్ ఇండియా పేజెంట్ టైటిల్ గెలుచుకుంది. దీంతో ఈ బ్యూటీకి సినిమాల్లో అవకాశం వచ్చింది.

2021లో అక్కినేని సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అంతగా హిట్ కాలేదు. కానీ మీనాక్షికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలో మెరిసింది.ఈ మూవీతో మరోసారి నిరాశే ఎదురైంది. ఇక గతేడాది హిట్ 2 సినిమాతో మరోసారి బిగ్ స్క్రీన్ పై మెరిసింది. ఈ మూవీ హిట్ కావడమే కాదు.. మీనాక్షికి పాపులారిటీని తెచ్చిపెట్టింది. దీంతో ఈ అమ్మకు అదృష్టం పట్టేసింది. వెంటనే త్రివికమ్ తెరకెక్కిస్తోన్న సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఆ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తుంది. ఇందులో ముందుగా పూజా నటించాల్సి ఉండగా.. అనుహ్యంగా ఆమె తప్పుకోవడంతో.. పూజా స్థానంలోకి మీనాక్షిని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమానే కాకుండా తెలుగులో వరుణ్ తేజ్ నటిస్తోన్న మట్కా చిత్రంలోనూ నటిస్తుంది. అలాగే ఇటీవలే విజయ్ దళపతి నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో మీనాక్షి ఎంపికైన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి
పరువు పోయేలా ఉంది, ఆ ఇద్దరిని వెంటనే పీకేయండి
తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్!
తినడానికి తిండి లేక రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారిన క్రికెటర్!
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
బాప్ రే.. నిద్రలో ఉన్న వ్యక్తిపై పాకుతున్న నాగుపాము:వీడియో వైరల్
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
తోటకూర వీళ్లకు యమడేంజర్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
అందుకే రైతులకు డబ్బులు ఇవ్వలేదు: బిగ్‌బాస్‌ విజేత పల్లవి ప్రశాంత్
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
దూసుకొస్తున్న గండం.. ఏపీలో సోమవారం వాతావరణం ఎలా ఉంటుంది..?
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ఛీ, ఇంత స్వార్థపరుడనుకోలే.. మనోడు కూడా మోసం చేస్తాడనుకోలే..
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
ట్రాఫిక్ లైట్లలో ఎరుపు,పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే
రూ. 16లకే షాపింగ్ ఆఫర్.. ఒక్కసారిగా విరుచుకుపడ్డ జనం.. కట్ చేస్తే