Nikhil’s Spy Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై.. సినిమా టాక్ ఏంటంటే

స్వామిరారా సినిమా దగ్గర నుంచి ఈ యంగ్ హీరో వరుస విజయాలను అందుకుంటున్నాడు . ఇటీవలే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నిఖిల్. ఇప్పుడు స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Nikhils Spy Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై.. సినిమా టాక్ ఏంటంటే
Spy

Updated on: Jun 24, 2023 | 12:58 PM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఆచితూచి కథలను ఎంచుకుంటూ సక్సెస్ అవుతున్నాడు. స్వామిరారా సినిమా దగ్గర నుంచి ఈ యంగ్ హీరో వరుస విజయాలను అందుకుంటున్నాడు . ఇటీవలే కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాలతో హిట్స్ అందుకున్న నిఖిల్. ఇప్పుడు స్పై సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న స్పై సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన స్పై థ్రిల్లర్ ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నిఖిల్ సినిమా పైన కూడా మంచి అంచనాలుఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాను ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పాన్ ఇండియా మూవీ గా స్పై రిలీజ్ కానుంది.

సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీగా ఈ సినిమా కథ ఉండనుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా స్పై సినిమా రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు చిత్రయూనిట్.

తాజాగా స్పై మూవీ సెన్సార్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీకి ఎటువంటి కట్స్ లేకుండా యూ /ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. అలాగే ఈ మూవీలో యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయని. అలాగే ట్విస్ట్ లు కూడా ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్పినట్టు తెలుస్తోంది.