హీరోయిన్ ఫోటోకు నెటిజన్ ఛండాలపు కామెంట్.. ఆ బ్యూటీ ఏం చేసిందంటే

సెలబ్రెటీల లైఫ్ లో సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది. సినిమా సెలబ్రెటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో.. దాని వల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

హీరోయిన్ ఫోటోకు నెటిజన్ ఛండాలపు కామెంట్.. ఆ బ్యూటీ ఏం చేసిందంటే
Actress

Updated on: May 16, 2026 | 6:35 PM

సోషల్ మీడియా ద్వారా చాలా మంది నటీనటులు ఎన్నో వేధింపులు, ట్రోల్స్ ఎదుర్కొంటు ఉంటారు. సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. ఒక్క చిన్న తప్పు చేసిన, నోరు జారి చిన్న కామెంట్ చేసినా.. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తుంటారు. అలాగే కొంతమంది సినీ తారలు కావాలనే ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా సినీ సెలబ్రటీలకు సోషల్ మీడియా ద్వారా ఎంత లాభం ఉంటుందో అంతే నష్టం కూడా ఉంటుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ కామెంట్స్ పై చాలా మంది తారలు స్పందించిన విషయం తెలిసిందే.. కొంతమంది ఘాటుగా రియాక్ట్ అయితే మరికొంతమంది అలాంటివి పట్టించుకోము అని స్టేట్మెంట్ ఇస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ హీరోయిన్ పై ఓ నెటిజన్ దారుణమైన కామెంట్ చేశాడు .

ఇది కూడా చదవండి : మూడు పెళ్లిళ్లు చేసుకొని తప్పు చేశా.. టైం అంతా వేస్ట్.. ఇప్పుడు బుద్దొచ్చింది

చైత్ర జే ఆచార్ గురించి తెలిసే ఉంటుంది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ అందాల తార. సప్తసాగరాలు దాటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది.  అలాగే సిద్ధార్థ్ తమిళ మూవీ ‘3BHK’ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది చైత్ర జే ఆచార్. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది చైత్ర జే ఆచార్. కాగా ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా గ్రామ్ లో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :RK Roja: ఒక్కహీరో కూడా నాకు లవ్ ప్రపోజ్ చేయలేదు.. కారణం ఏంటో చెప్పిన రోజా

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ ఫోటోల పై ఓ నెటిజన్ అసభ్యకరమైన కామెంట్ చేశాడు. నువ్వు హీరోయిన్‌వా లేక సె* వర్కర్‌వా? పద్ధతిగా ప్రవర్తించడం నేర్చుకో అంటూ ఈ అమ్మడి ఫోటోలకు కామెంట్ చేశాడు. పైగా అతను కామెంట్ చేసిన ప్రొఫైల్ లో పోలీస్ డ్రస్ వేసుకోండి డిపి పెట్టాడు. దాంతో అతని కామెంట్‌ను స్క్రీన్‌షాట్ తీసి, బెంగళూరు సిటీ పోలీస్ అధికారిక హ్యాండిల్‌కు ట్యాగ్  చేసింది చైత్ర ఆచార్. “గౌరవనీయులైన బెంగళూరు సిటీ పోలీస్.. ఈ అకౌంట్ మీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిదే అనుకుంటా.. దయచేసి ఇతనికి మీరే సమాధానం చెప్పండి” అని చైత్ర రాసుకొచ్చారు. దాంతో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి :భర్తను దర్శకుడిని చేద్దాం అనుకుంది.. కానీ బెడిసికొట్టింది.. సంపాదించిందంతా పోగొట్టుకొని చివరకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us