Nayanthara: నయన్ షాకింగ్‌ నిర్ణయం.. యాక్టింగ్‌కు గుడ్‌బై..!

దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయన్‌కి పేరుంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న స్టేజ్‌లో నయన్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు..

Nayanthara: నయన్ షాకింగ్‌ నిర్ణయం.. యాక్టింగ్‌కు గుడ్‌బై..!
Nayanthara

Updated on: Feb 25, 2023 | 7:37 PM

సుమారు 20 ఏళ్లుగా సినీ ప్రియులను అలరిస్తోన్న అగ్రకథానాయిక నయనతార వివాహం తర్వాత కూడా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు. 2003లో విడుదలైన మలయాళ మువీతో ‘మనస్సినాక్కేర్’ తో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన నయన్‌ తమిళ, హిందీ, మలయాళం, తెలుగు భాషల్లో ఎన్నో బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌లు అందుకున్నారు. అటు గ్లామరస్‌ పాత్రలు చేస్తూనే మరోవైపు కథానాయిక ప్రాథాన్యమున్న మువీలు కూడా చేస్తూ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఇక భర్త విగ్నేష్ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను 2021లో ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థపై ‘కాతువకులా రెండే కధల్,’ ‘నెట్రికాన్’, ‘కూజంగల్’ వంటి హిట్‌లను అందుకున్నారు. దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గానూ నయన్‌కి పేరుంది. కెరీర్‌ పీక్‌లో ఉన్న స్టేజ్‌లో నయన్‌ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది అక్టోబర్‌లో ఈ జంట సరోగసీ ద్వారా కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. నటనకు కాస్త విరామం ఇచ్చి.. తన పిల్లల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నటి నయన్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఐతే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ వెలువడనప్పటికీ ప్రస్తుతం నయన్‌ చేతిలో పలు భారీ ప్రాజెక్టులున్నాయి. ‘జవాన్‌’, ‘లేడీ సూపర్ స్టార్ 75’, ‘పాటు’, ‘ఎకె 62’లతోపాటు పూరి జగన్నాద్ అప్‌కమింగ్‌ మువీ ‘ఆటో జానీ’లో నటించనున్నట్లు సమాచారం. ఏదిఏమైనప్పటికీ ఈ వార్తలపై నయన్‌ స్పందించేంత వరకు నిజం తెలియరాదు.

ఇవి కూడా చదవండి

తాజా సినిమీ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us