
ఆ సినిమాలో నటించబోయే ప్రతినాయకుల సైన్యం కారణంగా కూడా ప్రత్యేకంగా నిలుస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు పవర్‌ఫుల్ విలన్లు మన హీరోను ముప్పుతిప్పలు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో ఒకరు డైలాగ్ కింగ్ అయితే, మరొకరు నటనలో దిట్ట.. ఇంకొకరు బాలీవుడ్‌ను షేక్ చేసిన యంగ్ విలన్. అసలు నానిని ఢీకొట్టబోతున్న ఆ డేంజరస్ విలన్లు ఎవరు? ఈ సినిమాలో కామెడీ స్టార్లకు ఇచ్చిన ఆ సీరియస్ రోల్స్ ఏంటి?
ఈ సినిమాలో అత్యంత ఆసక్తికరమైన అంశం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్‌గా నటిస్తుండటం. చాలా కాలం తర్వాత ఆయన ఒక పూర్తి స్థాయి నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పోషిస్తున్న పాత్ర అత్యంత క్రూరంగా, ప్రమాదకరంగా ఉంటుందని సమాచారం. మోహన్ బాబు మార్క్ డైలాగ్ డెలివరీ, గంభీరమైన నటన నాని పాత్రను మరింత ఎలివేట్ చేయడానికి తోడ్పడనున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.
సాధారణంగా ఎంతో సౌమ్యమైన, సహజమైన పాత్రల్లో కనిపించే సీనియర్ నటుడు తణికెళ్ల భరణి ఈ సినిమాలో ఒక కీలకమైన విలన్ పాత్రలో మెరవబోతున్నారు. ఇప్పటివరకు మనం చూడని ఒక విభిన్నమైన లుక్‌లో ఆయన కనిపించనున్నారట. మోహన్ బాబు, తణికెళ్ల భరణి వంటి దిగ్గజ నటులు ఒకే సినిమాలో ప్రతినాయకులుగా ఉండటం ‘ది ప్యారడైస్’ సినిమాకు ఒక పెద్ద అసెట్‌గా మారనుంది. వీరిద్దరి అనుభవం శ్రీకాంత్ ఓదెల రాసుకున్న పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌కు మరింత బలాన్ని ఇవ్వనుంది.
Paradise Villains
కేవలం తెలుగు నటులే కాకుండా బాలీవుడ్ నుండి రాఘవ్ జుయాల్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్‌గా హిందీలో వచ్చిన ‘కిల్’ సినిమాలో రాఘవ్ చేసిన విలనిజం చూసి అందరూ షాక్ అయ్యారు. ఇప్పుడు అదే తరహాలో నాని సినిమాలో కూడా ఒక నెగటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో ఆయన కనిపించబోతున్నాడు. రాఘవ్ రాకతో ఈ ప్రాజెక్టుకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ పెరిగింది.
సాధారణంగా కామెడీతో నవ్వించే బాబు మోహన్, సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో మనల్ని ఆశ్చర్యపరచబోతున్నారు. వీరిద్దరికీ కథకు బలం ఇచ్చే కీలకమైన పాత్రలను శ్రీకాంత్ ఓదెల డిజైన్ చేశారట. ఎక్కడా కామెడీ ఛాయలు లేకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో వీరు కనిపించనున్నారు. ‘దసరా’ సినిమాలో విలన్లను ఎంతో బలంగా చూపించిన దర్శకుడు, ఈసారి కూడా ప్రతి పాత్రకు న్యాయం చేసేలా పక్కా ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. నాని కెరీర్‌లోనే అత్యంత హింసాత్మకంగా, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ది ప్యారడైస్’ 2026 మొదటి భాగంలో విడుదల కానుంది. ఇన్ని శక్తివంతమైన పాత్రల మధ్య నాని తన విశ్వరూపం ఎలా చూపిస్తాడో చూడాలి.