The Paradise: దసరా, హిట్ 3 రికార్డులు బద్దలు.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కొట్టిన ప్యారడైజ్

దసరా లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో వచ్చిన పారడైజ్ సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. ఓవైపు యూట్యూబ్, సోషల్ మీడియాలో ది ప్యారడైజ్ మూవీ సాంగ్స్ సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మరి వాటన్నింటినీ నిలబెడుతూ పారడైజ్ అంచనాలు అందుకుంది.

The Paradise: దసరా, హిట్ 3 రికార్డులు బద్దలు.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కొట్టిన ప్యారడైజ్
Nani

Updated on: Sep 25, 2026 | 7:08 AM

నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది ప్యారడైజ్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్ అందుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. తొలిరోజు వసూళ్లలోనూ తన సత్తా చాటింది. తాజా  సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ ఇండియాలో తొలిరోజు ఇప్పటివరకు రూ.34.65 కోట్ల నెట్ వసూళ్లు సాధించిందని తెలుస్తుంది. ఈ కలెక్షన్స్ ఇంకా ఫైనల్ కాకపోవడంతో ఫస్ట్ డే పూర్తయ్యే సమయానికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ది ప్యారడైజ్ తొలి రోజు వసూళ్లు నాని గత సినిమాల ఓపెనింగ్ రికార్డులను దాటేశాయి. ఇప్పటివరకు నాని కెరీర్‌లో మంచి ఓపెనింగ్స్ అందుకున్న దసరా, హిట్: 3 కేస్ సినిమాలను కూడా ఈ మూవీ దాటేసింది.

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ రచ్చ.. ఈ అమ్మడు ఎవరో తెలుసా.?

దసరా తొలి రోజు సుమారు రూ.23.20 కోట్ల వసూళ్లు సాధించగా, హిట్: 3 కేస్’ ఫస్ట్ డే దాదాపు రూ.21 కోట్ల రేంజ్‌లో వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో ది ప్యారడైజ్  ఓపెనింగ్ నానికి కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ది ప్యారడైజ్‌కు తెలుగు మార్కెట్‌లోనే అత్యధిక రెస్పాన్స్ లభించిందని తెలుస్తుంది. తాజాగా సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ ద్వారా రూ.25.10 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. హిందీలో రూ.1.82 కోట్లు, తమిళంలో రూ.1.02 కోట్లు నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నాని క్రేజ్, భారీ థియేట్రికల్ రిలీజ్, ముందస్తు బుకింగ్స్ సినిమాకు భారీ ఓపెనింగ్ రావడానికి   రిలీజ్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో నమోదయ్యాయి.

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..! అప్పుడు తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి

దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన సినిమా కావడంతో ది ప్యారడైజ్ పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ స్థాయిలో రూపొందించిన ఈ యాక్షన్ డ్రామాలో నాని పూర్తిగా భిన్నమైన గెటప్‌లో కనిపించారు. రిలీజ్‌కు ముందు అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఈ సినిమా మంచి జోరు చూపించింది. ప్రస్తుతం అందుతున్న ఫస్ట్ డే లెక్కలతో నాని కెరీర్‌లోనే ది ప్యారడైజ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అయితే ఫైనల్ డే-1 కలెక్షన్స్ వెల్లడైన తర్వాత ఈ రికార్డు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

స్టార్ హీరోలు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా 460 రోజులు థియేటర్లలో హౌస్‌ఫుల్.!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us