tuck jagadish trailer : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం టక్ జగదీష్. శివ నిర్వాణం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రీతువర్మ నటిస్తుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన “టక్ జగదీష్” పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే కరోనా కల్లోలం కారణంగా సినిమా షూటింగ్ లన్నీ నిలిచిపోయి రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో “టక్ జగదీష్” సినిమా కూడా వాయిదా పడింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. . సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్‌గా సెట్ చేయబడిన టక్ జగదీష్ 240 దేశాల ప్రేక్షకులకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉండనుంది. ఈ సినిమాలో జగపతి బాబు, ఐశ్వర్య రాజేష్, తిరువీర్, వైష్ణవి చైతన్య, దేవదర్శిని, డేనియల్ బాలాజీ వంటి ప్రముఖులు నటించారు. ఈ మూవీ ట్రైలర్ పై మీరూ ఓ లుక్కెయండి.
మరిన్ని ఇక్కడ చదవండి :