ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే.. మాతో క్రికెట్ మ్యాచ్‌‌లు ఆడేవాడు

సినిమా ఇండస్ట్రీలో నందమూరి వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా అరంగేట్రం చేశాడు నందమూరి చైతన్య కృష్ణ. 2003లో జగపతిబాబు హీరోగా వచ్చిన ‘ధమ్’ సినిమాలో మొదటి సారిగా నటించాడు చైతన్య కృష్ణ. దీని తర్వాత చాలా ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయాడు .

ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే.. మాతో క్రికెట్ మ్యాచ్‌‌లు ఆడేవాడు
Nandamuri Chaitanya Krishna

Updated on: Jul 14, 2026 | 12:06 PM

నందమూరి కుటుంబానికి చెందిన నటుడు చైతన్య కృష్ణ తన సోదరులు తారకరత్న, జానకిరామ్‌లతో తనకున్న అనుబంధాన్ని, వారి నిరాడంబరమైన వ్యక్తిత్వాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. కుటుంబం ఎదుర్కొన్న విషాదాలు, తన వ్యక్తిగత జ్ఞాపకాలను భావోద్వేగంగా పంచుకున్నారు. తారకరత్న, జానకిరామ్‌ల అకాల మరణాలు తమ కుటుంబానికి తీరని లోటని, వాటిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయన పేర్కొన్నారు. తారకరత్నతో తన అనుబంధాన్ని వివరిస్తూ, చైతన్య కృష్ణ ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ మనిషో తెలిపారు. “అతనికి నేనే డ్రైవింగ్ నేర్పించాను. ఒకానొక సమయంలో, నీ వల్లే నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను అని తారకరత్న అనేవాడు” అని చైతన్య కృష్ణ గుర్తు చేసుకున్నారు.

ఇది కూడా చదవండి : ఐరెన్ లెగ్ అని అవమానించారు.. 9 సినిమాలనుంచి తీసేశారు.. కట్ చేస్తే ఇప్పుడు తోప్ హీరోయిన్

తారకరత్నలో ఎన్టీఆర్ మనవడిననే గర్వం కానీ, పొగరు కానీ ఎప్పుడూ కనిపించలేదని, చాలా స్నేహపూర్వకంగా ఉండేవారని ఆయన ప్రశంసించారు. చిన్నతనంలో తారకరత్నతో కలిసి పక్కపక్కనే ఉండేవారని, కళ్యాణ్ రామ్ కూడా తమతో వచ్చి క్రికెట్ ఆడేవారని చైతన్య కృష్ణ తెలిపారు. ప్రతి ఆదివారం క్రికెట్ మ్యాచ్‌లు పెట్టుకునేవారని, తారకరత్న మంచి బౌలర్ అని ఆయన స్మరించుకున్నారు.

ఇది కూడా చదవండి : అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ దగ్గర పని చేశాడు.. కట్ చేస్తే ఇండస్ట్రీలో తిరుగులేని నటుడు

తన తాతగారు ఎన్టీఆర్‌తో తారకరత్న దిగిన ఒకే ఒక్క ఫోటోకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటనను చైతన్య కృష్ణ వెల్లడించారు. 1996 జనవరి 1న, తాతగారిని కలవడానికి వెళ్లినప్పుడు తారకరత్న కూడా తనతో వచ్చారని, అప్పుడే ఆ ఫోటో దిగారని తెలిపారు. ఆ ఫోటో దిగిన పదిహేను రోజుల తర్వాత, జనవరి 18న ఎన్టీఆర్ గారు మరణించారని, అది తన తాతగారితో తారకరత్న దిగిన చివరి ఫోటో అని చైతన్య కృష్ణ భావోద్వేగంగా చెప్పారు. ఆ ఫోటో కూడా తన వద్ద ఉందని, అది ప్రస్తుతం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఆ నటుడు బంగారం తాకట్టుపెట్టి త్రివిక్రమ్‌కు డబ్బులు ఇచ్చాడు.. షాకింగ్ విషయం చెప్పిన పోసాని

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us