Chaitanya Krishna: మరో కొత్త సినిమా సైన్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ.. డైరెక్టర్ ఎవరంటే..

కొద్ది రోజుల క్రితం చైతన్య కృష్ణ హీరోగా 'బ్రీత్' అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్ నంబర్ 1 పోస్టర్ బాలకృష్ణ లాంచ్ చేయగా.. ఫస్ట్ లుక్ నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ నందమూరి ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా మార్చి 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Chaitanya Krishna: మరో కొత్త సినిమా సైన్ చేసిన నందమూరి చైతన్య కృష్ణ.. డైరెక్టర్ ఎవరంటే..
Nandamuri Chaitanya Krishna

Updated on: Mar 05, 2024 | 9:04 PM

నందమూరి చైతన్య కృష్ణ.. ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. ఆయన ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోస్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆయన ఇంటర్వ్యూ వీడియోస్ పై ఓ రేంజ్‍లో ట్రోల్స్, మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. అసలు విషయానికి వస్తే.. కొద్ది రోజుల క్రితం చైతన్య కృష్ణ హీరోగా ‘బ్రీత్’ అనే సినిమా చేశారు. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించగా.. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సినిమా ప్రొడక్షన్ నంబర్ 1 పోస్టర్ బాలకృష్ణ లాంచ్ చేయగా.. ఫస్ట్ లుక్ నందమూరి కళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. కానీ ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలంటూ నందమూరి ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేశారు. దీంతో ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా మార్చి 8న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమాను ఎట్టకేలకు అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.

దీంతో ఇప్పుడు బ్రీత్ సినిమాను ఓటీటీలో చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే చైతన్య కృష్ణ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ డైరెక్టర్ జీకే చౌదరి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అంతేకాదు.. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నమని తెలిపారు. అయితే చైతన్య కృష్ణ మరో సినిమాకు జీకే చౌదరీ కేవలం కో డైరెక్టర్ మాత్రమే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో చైతన్య కృష్ణ కొత్త సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది.

నందమూరి చైతన్య కృష్ణ.. దివంగత ఎన్టీఆర్ పెద్ద కొడుకు జయకృష్ణ కుమారుడు. నిజానికి ఆయన 2003 లో వచ్చిన ధమ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. కానీ ఈ మూవీలో జగపతి బాబు హీరోగా నటించారు. ఈ మూవీ విడుదలైన 20 ఏళ్లకు బ్రీత్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. సుమారు రూ. 4 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా.. జీరో కలెక్షన్స్ వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.