జీపులో వస్తా.. టాపు లేపుతా: బాలయ్య

| Edited By: Srinu

Jul 22, 2019 | 7:26 PM

నందమూరి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ మూవీలో పోలీసు డ్రెస్సుల్లో బాలయ్య నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ సినిమానే రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ప్రత్యేక క్లాసులు తీసుకున్నారని సమాచారం. పోలీసులు ఎలా నడుస్తారు. ఎలా కూర్చుంటారు. ఎలా లాఠీ పట్టుకుంటారు. లాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బి. గోపాల్‌ను […]

జీపులో వస్తా.. టాపు లేపుతా:  బాలయ్య
Follow us on

నందమూరి బాలకృష్ణ నటించిన రౌడీ ఇన్స్పెక్టర్ తెలుగులో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ఆ మూవీలో పోలీసు డ్రెస్సుల్లో బాలయ్య నటన చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అప్పట్లో ఈ సినిమానే రికార్డులు బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమా కోసం బాలయ్య ప్రత్యేక క్లాసులు తీసుకున్నారని సమాచారం. పోలీసులు ఎలా నడుస్తారు. ఎలా కూర్చుంటారు. ఎలా లాఠీ పట్టుకుంటారు. లాంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బి. గోపాల్‌ను కూడా చాలా ఇబ్బంది పెట్టేవారట బాలయ్య. నటన మీద తనకున్న ప్యాషన్‌తో.. గోపాల్‌కు ఓ రోజు బాలయ్య కాల్ చేసి.. తాను చిత్రీకరణకు రావడం లేదన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమాలో తాను వాడుతున్న జీపును పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా అని.. అప్పుడే ఆ క్యారెక్టర్‌లో లీనమవ్వగలను అని దర్శకునితో చెప్పాడట. దీంతో గోపాల్.. ఆరోజు నుంచి ప్రతిరోజు పోలీసు జీపు పంపించేవారని తెలుస్తోంది. ఎప్పుడూ ఏపీ కారులో తిరిగే బాలయ్య… ఆ రోజు నుంచి పోలీసు జీపులో పోలీసులా వచ్చేవాడట. బాలయ్యకు సినిమా అంటే అంత ప్యాషన్‌.. అంటూ ఓ సందర్బంలో డైరెక్టర్ గుర్తుచేసుకున్నారు.