క్రేజీ కాంబో..బాలయ్యతో పాయల్..!

| Edited By: Pardhasaradhi Peri

Mar 19, 2020 | 8:27 PM

‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో తెలుగు కుర్రాళ్లు గుండెల్లో సెగలు రాజేసింది యువ కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత ఈ భామ చేసిన ప్రాజెక్ట్స్ ఏవీ పెద్దగా విజయం సాధించలేదు. మాస్ మహారాజ్ రవితేజతో ‘డిస్కో రాజా’ చిత్రం చేసినా కూడా అమ్మడు కెరీర్‌కు ఊపు రాలేదు. అయితే తాజాగా పాయల్‌ ఓ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నట సింహ నందమూరి బాలకృష్ణ సరసన నటించే క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట ఈ […]

క్రేజీ కాంబో..బాలయ్యతో పాయల్..!
Follow us on

‘ఆర్‌ఎక్స్ 100’ మూవీతో తెలుగు కుర్రాళ్లు గుండెల్లో సెగలు రాజేసింది యువ కథానాయిక పాయల్‌ రాజ్‌పుత్‌. ఆ తర్వాత ఈ భామ చేసిన ప్రాజెక్ట్స్ ఏవీ పెద్దగా విజయం సాధించలేదు. మాస్ మహారాజ్ రవితేజతో ‘డిస్కో రాజా’ చిత్రం చేసినా కూడా అమ్మడు కెరీర్‌కు ఊపు రాలేదు. అయితే తాజాగా పాయల్‌ ఓ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. నట సింహ నందమూరి బాలకృష్ణ సరసన నటించే క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట ఈ అమ్మడు.

బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతోన్న మూవీలో  నాయికగా పాయల్‌ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో మూవీ యూనిట్ పలువురు బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిల్ని సంప్రదించినట్లు టాక్ నడిచింది. అయితే వాళ్ల కాల్షీట్లు దొరక్కపోవడంతో పాటు రెమ్యూనరేషన్‌ కూడా భారీగా డిమాండ్ చేస్తుండటంతో పాయల్‌ని అప్రోచ్ అయ్యారని సమాచారం.

త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్‌ జీవితాధారంగా క్రిష్‌ తెరకెక్కించిన ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’లో బాలయ్య పక్కన మెరిసింది పాయల్. మరోసారి ఈ జోడి సిల్వర్ స్క్రీన్‌పై ఎటువంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.