ఫ్రెండ్ రోల్ అన్నారు.. కానీ హీరోయిన్‌లా ఉన్నానని సినిమా నుంచి తీసేశారు.. : బిగ్ బాస్ బ్యూటీ

బిగ్ బాస్ ద్వారా చాలా మంది ముద్దుగుమ్మలు పాపులర్ అయ్యారు. కొందరు సినిమాల్లో అవకాశాలు సొంతం చేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటూ రాణిస్తున్నారు. కొంతమంది మాత్రం కనిపించకుండాపోయారు. కొంతమంది వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉన్నారు .

ఫ్రెండ్ రోల్ అన్నారు.. కానీ హీరోయిన్‌లా ఉన్నానని సినిమా నుంచి తీసేశారు.. : బిగ్ బాస్ బ్యూటీ
Actress

Updated on: Jun 24, 2026 | 1:57 PM

సినిమా ఇండస్ట్రీలో అవకాశం రావడమే చాలా అరుదు. అలాంటిది ఛాన్స్ వచ్చిన తర్వాత అది మిస్ అయితే ఎలా ఉంటుంది.. అది ప్యూర్ బ్యాడ్ లక్ అనే చెప్పాలి. అలాంటి బ్యాడ్ లక్కే ఓ అమ్మడి విషయంలోనూ జరిగింది. హీరోయిన్ లా ఉంది అని ఆమెను ఓ సినిమా నుంచి తప్పించారు. అవును మీరు విన్నది నిజమే హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆమెను సెలక్ట్ చేసిన తర్వాత ఆమె కూడా చూడటాన్ని ఆ హీరోయిన్ లానే ఉండటంతో ఆమెను సినిమా నుంచి తప్పించారట. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? ఆమె ఎవరో కాదు అందాల భామ నైనిక. ఈ అమ్మడు తన డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్ సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి :కొడక్కు పెళ్ళై 9 నెలలు, సినిమా మొదలై 9 రోజులు.! కట్ చేస్తే సముద్రంలో శవమై.. గొల్లపూడి మారుతీరావు జీవితంలో ఇంత విషాదమా.!!

ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది ఈ అమ్మడు. బిగ్ బాస్ ఈ ముద్దుగుమ్మ ఉన్నది కొన్ని వారాలే కానీ తన ఆటతో ఆకట్టుకుంది నైనిక.. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ చిన్నది పలు ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన ఆడిషన్ అనుభవాలు, చిత్ర పరిశ్రమలో ఎదురైన రిజెక్షన్స్ గురించి మాట్లాడుతూ.. రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాలో ఒక పాత్ర కోసం ఆడిషన్ చేసినప్పుడు తనకు ఎదురైన ఒక ప్రత్యేకమైన సందర్భాన్ని చెప్పుకొచ్చింది.

ఇది కూడా చదవండి : ఇన్నాళ్లు ఇది మనకు తెలీదే.. ఖడ్గం సినిమాలో సోనాలి బింద్రేకు డబ్బింగ్ చెప్పింది ఈ హీరోయినా.!!

నైనిక ఈ పాత్ర కోసం దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కలిసిందట.. ఆడిషన్స్ కూడా ఇచ్చానని తెలిపింది. అయితే, ఆమెను హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ పాత్ర కోసం తీసుకున్నారు. కానీ చిత్ర బృందం నుంచి ఒక విచిత్రమైన స్పందన వచ్చిందట. “ఒక యాంగిల్ నుంచి మీరు కొంచెం రష్మిక మందన్న లాగానే ఉన్నారు” అని చెప్పారట. అంతేకాకుండా, ఆ పాత్రకు పేదరికం కనిపించే నటి అవసరమని, నైనిక గ్లామరస్‌గా, స్క్రీన్‌పై రిచ్‌గా కనిపిస్తున్నారని చెప్పారట. తాను మేకప్ ద్వారా ఆ లుక్‌ను మార్చుకోవచ్చని చెప్పినా, “నెక్స్ట్ టైమ్ చూద్దాం” అని చెప్పి రిజెక్ట్ చేశారని నైనిక తెలిపింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గొప్ప వ్యక్తి అని, తన ఆడిషన్స్‌లో సహాయం చేశారని నైనిక స్పష్టం చేశారు. అయితే, ఆ పాత్ర తనకు సరిపోదని సినిమా చూశాక అనిపించిందని నైనిక తెలిపింది.

ఇది కూడా చదవండి : అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది: నందిని రెడ్డి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us