
‘నా సామిరంగ’ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు అక్కినేని నాగార్జున. చాలా కాలం గ్యాప్ తీసుకున్న కింగ్.. ఈ సంక్రాంతికి అభిమానులకు మాస్ కంటెంట్‌తో అలరించాడు. విలేజ్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతోనే ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమయ్యాడు విజయ్. ఇందులో కన్నడ తార ఆషికా రంగనాథ్, రుక్సాన్ థిల్లన్, మిర్నా, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎమ్ ఎమ్ కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. విడుదలకు ముందే ట్రైలర్, పోస్టర్లు, పాటలతో క్యూరియాసిటిని పెంచేసిన ఈ మూవీ.. జనవరి 14న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటిలాగే ఈసారి సంక్రాంతికి కూడా సక్సెస్ అందుకున్నాడు నాగ్. మొదటి రోజే మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తుంది.
విడుదలైన మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు రాబడుతూ దూసుకెళ్తుంది నా సామిరంగ. నైజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్ లో రూ.60 లక్షలు, విశాఖపట్నంలో రూ.51లక్షలు, తూర్పు గోదావరి రూ.44 లక్షలు, వెస్ట్ గోదావరి రూ.22 లక్షలు, కృష్ణ రూ.24 లక్షలు, గుంటూరు రూ.34 లక్షలు, నెల్లూరు రూ. 18 లక్షలు రాబట్టింది. మొత్తం రూ. 3.58 కోట్లు షేర్ అందుకోగా.. మూడు రోజుల్లోనే ఈ సినిమా రూ. 12.46 కోట్ల షేర్ రాబట్టింది.
Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥
Total 3 Days WW gross is 24.8 crores💥
Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara
🎟 https://t.co/98AYdTNMvkKING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/5ftce1lhR6
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 17, 2024
ఇక ప్రపంచవ్యాప్తంగా రూ. 24.8 కోట్ల షేర్ అందుకుని సాలిడ్ రన్ తో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమా మొదటి రోజే రూ. 8.6 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక ఇంకో రెండు రోజులు సంక్రాంతి హాలీడేస్ ఉండడం… 25 వరకు వేరే సినిమాలు లేకపోవడంతో నా సామిరంగ రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు మేకర్స్.
నా అభిమాన నటుడు, నా అన్నమయ్య, శ్రీరామదాసు అయిన నాగార్జున నటించిన నా సామిరంగా చిత్రం విజయాన్ని సాధించడం సంతోషకరమైన విషయం. నాగార్జున నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. అల్లరి నరేష్ చక్కగా తన పాత్రను పోషించాడు. నా సామిరంగా చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. pic.twitter.com/aNgTgf9ZF0
— Raghavendra Rao K (@Ragavendraraoba) January 15, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.