Wild Dog Movie: ఆకట్టుకుంటున్న ట్రైలర్ …10 మిలియ‌న్ వ్యూస్‌ను దాటిన కింగ్ నాగార్జున ‘వైల్డ్ డాగ్‌’‌

|

Mar 20, 2021 | 10:18 PM

అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం 'వైల్డ్ డాగ్‌'‌. మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించి, యూట్యూబ్‌లో 10 మిలియ‌న్ వ్యూస్‌ను దాటింది. 

Wild Dog Movie: ఆకట్టుకుంటున్న ట్రైలర్ ...10 మిలియ‌న్ వ్యూస్‌ను దాటిన కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్‌‌
Nagarjuna
Follow us on

Wild Dog Movie: అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్‌’‌. మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించి, యూట్యూబ్‌లో 10 మిలియ‌న్ వ్యూస్‌ను దాటింది. వ‌రుస బాంబు దాడుల‌తో దేశంలో టెర్ర‌రిస్టులు మార‌ణ‌కాండ సృష్టించిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో.. ఆ టెర్ర‌రిస్టుల‌ను త‌న టీమ్‌తో నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ (ఎన్ఐఏ)లో ఏసీపీగా ప‌నిచేసే విజ‌య్ వ‌ర్మ ఎలా తుద‌ముట్టించాడనే విష‌యాన్ని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా, రోమాలు నిక్క‌బొడుచుకొనే రీతిలో ద‌ర్శ‌కుడు అహిషోర్ సాల్మ‌న్ రూపొందించారు. ట్రైల‌ర్ చూస్తే, ఆ విష‌యం స్ప‌ష్ట‌మ‌వుతుంది.

ఏసీపీ విజయ్ వ‌ర్మ‌ను వైల్డ్ డాగ్ అని ఎందుకంటారో కూడా మ‌న‌కు ట్రైల‌ర్ తెలియ‌జేసింది. ఆ క్యారెక్ట‌ర్‌లో నాగార్జున లుక్స్‌కు, ఆయ‌న యాక్ష‌న్‌కు ఫ్యాన్స్‌తో పాటు యాక్ష‌న్ ప్రియులంద‌రూ ఫిదా అవుతున్నారు. ట్రైల‌ర్‌తో ‘వైల్డ్ డాగ్’‌పై ఆడియెన్స్‌లో క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది.మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న గ్రాండ్‌గా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విడుద‌ల తేదీ స‌మీపిస్తుండ‌టంతో హీరో నాగార్జున ఎగ్రెసివ్‌గా ప‌బ్లిసిటీ చేస్తున్నారు. అయితే రీసెంట్‌గా ఈ సినిమాలోని ఓ స్టిల్‌ను రిలీజ్ చేశారు కింగ్‌ నాగార్జున. బ్యాగ్రౌండ్‌లో కొండ‌లు క‌నిపిస్తుండ‌గా, చేతిలో ఏకే 47 గ‌న్ ప‌ట్టుకొని ప‌రుగెత్తుతూ క‌నిపిస్తున్నారు నాగ్‌. అంటే ఆయ‌న టెర్ర‌రిస్టుల‌కు సంబంధించిన ఒక ఆప‌రేష‌న్ మీద ఉన్నార‌ని అర్థ‌మ‌వుతోంది. చాలా రోజుల త‌ర్వాత ఆయ‌నకు ఫుల్ ప‌వ‌ర్‌ఫుల్ యాక్ష‌న్ రోల్ ల‌భించింది. ఆ రోల్‌లో ఆయ‌న‌ విజృంభించి న‌టించారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Raashi Khanna New Pics: గోల్డ్ కలర్‌లో మెరిసిన రాశి ఖన్నా.. చూస్తే కుర్రాళ్లు మతులు పోయినట్లే.!

Sonu Sood: సోనూ భాయ్‌‌కు అరుదైన గౌరవం.. ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ రియల్ హీరో..(Photo Gallery)

Minister Harish Rao: ‘చిచ్చా’ మూవీ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన మంత్రి హరీష్ రావు.. రాహుల్ స్టార్ అవుతాడంటూ కితాబు..