Niharika Konidela Corona Test : కరోనా టెస్ట్ చేయించుకున్న కొత్త పెళ్లికూతురు.. ఏం తేలిందంటే..

టాలీవుడ్ లో కరోనా మహమ్మ్మరి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ..

Niharika Konidela Corona Test : కరోనా టెస్ట్ చేయించుకున్న కొత్త పెళ్లికూతురు.. ఏం తేలిందంటే..

Updated on: Dec 31, 2020 | 4:26 PM

Niharika Konidela Corona Test : టాలీవుడ్ లో కరోనా మహమ్మ్మరి కల్లోలం సృష్టిస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు ఇప్పటికే కరోనా పాజిటివ్ గా తేలింది. మరో హీరో వరుణ్ తేజ్ కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డాడు. దాంతో అభిమానులంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇటీవల క్రిస్మస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అంత కలిసి పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఇద్దరు హీరోలకు పాజిటివ్ గా తేలడంతో మిగిలిన వాళ్ళు కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ రెండు సార్లు కరోనా టెస్ట్ చేయించుకున్నాడు. తాజాగా కొత్త పెళ్లికూతురు నిహారిక కూడా కరోనా టెస్ట్ చేయించుకుంది. ఈ విషయాన్ని నాగబాబు తెలిపారు. హనీమూన్‌లో భాగంగా మాల్దీవుల‌కు వెళ్లిన చైత‌న్య‌,నిహారిక కూడా క్రిస్మ‌స్ వేడుక‌ల‌లో పాల్గొన్నారు. మాల్దీవుల‌కు వెళ్లే ముందు డిసెంబ‌ర్ 26న ఇద్ద‌రు టెస్ట్ చేయించుకున్నారు. అందులో నెగెటివ్ అని తేలింది. డిసెంబ‌ర్ 29న ముంబై ఎయిర్ పోర్ట్‌లోనూ క‌రోనా ప‌రీక్ష‌లుచేయించుకున్నారు. ఆ రిపోర్ట్స్‌లోను నెగెటివ్ వ‌చ్చింద‌ని నాగబాబు పేర్కొన్నారు.

ALSO READ :

Tamannaaah Drives Bus: అందాల తార బస్సు ఎలా నడిపిందో చూడండి.. వైరల్‌గా మారిన వీడియో..