Custody: ఇట్స్ అఫీషియల్.. కస్టడీ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఈ మూవీలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ జంట గతంలో బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. ఇక కస్టడీ సినిమాలో నాగ చైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటించారు. అలాగే తమిళ్ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు.

Custody: ఇట్స్ అఫీషియల్.. కస్టడీ మూవీ ఓటీటీలోకి వచ్చేది అప్పుడే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Custody

Updated on: Jun 07, 2023 | 5:37 PM

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నటించిన రీసెంట్ మూవీ కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ జంట గతంలో బంగార్రాజు సినిమాలో కలిసి నటించారు. ఇక కస్టడీ సినిమాలో నాగ చైతన్య కానిస్టేబుల్ పాత్రలో నటించారు. అలాగే తమిళ్ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా.. చైతు నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇలాంటి తరుణంలో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌పై కీలక అప్‌డేట్ వచ్చేసింది.

జూన్ నెల 9వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అమెజాన్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయినా.. ఓటీటీలో మాత్రం మంచి వ్యూస్ ను రాబట్టాయి.

ఇలానే కస్టడీ సినిమా కూడా ఓటీటీలో సూపర్ సక్సెస్ అవుతుంది అంటున్నారు అక్కినేని అభిమానులు. వెన్నెల కిషోర్, సంపత్ రాజు, శరత్ కుమార్, ప్రియమణి, ప్రేమ్‌జీ అమరన్ కీలక పాత్రలు కనిపించారు. కెరీర్‌లో మొదటిసారి పోలీస్ గెటప్‌లో కనిపించాడు నాగచైతన్య. అలాగే ఈ చిత్రానికి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.