AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారి మొదలుపెడితే ఆపలేం..! సినిమా మొత్తం ఊహించని ట్విస్ట్‌లు.. రొమాంటిక్ సీన్స్‌కు కొదవేలేదు

ఓటీటీలు అందుబాటిలోకి వచ్చిన తర్వాత థియేటర్స్‌తో పాటు ఓటీటీలోనూ సినిమాలు చూస్తూ ప్రేక్షకులు డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్స్‌లో విడుదలైన నెల రోజులకే ఓటీటీలో ప్రత్యక్షం అవుతున్నాయి సినిమాలు. ఒకటికి రెండు సార్లు ఓటీటీలో తమ అభిమాన సినిమా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు.

ఒక్కసారి మొదలుపెడితే ఆపలేం..! సినిమా మొత్తం ఊహించని ట్విస్ట్‌లు.. రొమాంటిక్ సీన్స్‌కు కొదవేలేదు
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Nov 15, 2025 | 1:09 PM

Share

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. రకరకాల సినిమాలు థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన సినిమాలు థియేటర్స్ లో దుమ్మురేపుతున్నాయి. అలాగే ఓటీటీల్లోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీల్లో తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సినిమాలతో పాటు హాలీవుడ్ సినిమాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో డబ్ అయిన సినిమాలకు యమా క్రేజ్ ఉంది. ఇక ఓటీటీలో రొమాంటిక్, హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక రొమాంటిక్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. చాలా రొమాంటిక్ సినిమాలు ఇప్పటికే ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్నాయి.

తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అదరగొడుతుంది. ఈ సినిమాలో ఊహించని ట్విస్ట్ లు ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. రొమాంటిక్ సినిమాల్లో ఈ రేంజ్ ట్విస్ట్ లు మీరు ఎక్కడా చూసుండరు. ఇంతకూ ఈ సినిమా ఎదో తెలుసా.? ఇప్పటికే మలయాళ సినిమాలు ఓటీటీలో ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న రొమాంటిక్ థ్రిల్లర్ కూడా ఓ మలయాళ సినిమానే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి భారీ హిట్ అందుకుంది ఈ రొమాంటిక్ మూవీ.

ఎలాంటి అంచనాలు లేకుండా.. పెద్ద హడావిడి లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తోపాటు.. రూ. 55 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ కు కొదవే లేదు. అంతే కాదు రొమాంటిక్ సీన్స్ లోనూ ఊహించని ట్విస్ట్ లు ఉంటాయి. ఇంతకూ ఈ సినిమా పేరు ఏంటంటే.. ఈ సినిమా పేరు అంచక్కల్లకోక్కన్. ఇదే సినిమాను తెలుగులో చాప్రా మర్డర్ కేసు టైటిల్ తో డబ్ చేశారు. ప్రస్తుతం ఈ రొమాంటిక్ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. లుక్మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్, మణికందన్ ఆర్ ఆచారి, మేఘా థామస్ ఈ సినిమాలో ప్రధానపాత్రలో నటించారు. ఈ సినిమా ఓ మర్డర్ మిస్టరీ థిల్లర్ కథతో తెరకెక్కింది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us