Chhaava Movie: ఛావా సినిమాను నిషేధించాలి.. అమిత్‌షాకు లేఖ రాసిన ముస్లిం మత గురువు

|

Mar 20, 2025 | 9:03 PM

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ లో తెరకెక్కిన చిత్రం ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాలీవుడ్ లో రికార్డుల మోత మోగించిన ఈ మూవీకి తెలుగులోనూ మంచి రెస్పాన్స్ వచ్చింది.

Chhaava Movie: ఛావా సినిమాను నిషేధించాలి.. అమిత్‌షాకు లేఖ రాసిన ముస్లిం మత గురువు
Chhava Movie
Follow us on

విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన పీరియాడికల్ మూవీ ఛావా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక మార్చి 07న తెలుగులోనూ ఛావా మూవీ రిలీజ్ కాగా, ఇక్కడ కూడా మంచి వసూళ్లే రాబడుతోంది. ఈ సినిమాలో మరాఠాలకు, మొఘలు పాలకులకు మధ్య ఘర్షణ, యుద్ధాలను ప్రధానంగా చూపించారు. ముఖ్యంగా మరాఠాలు ఎంతో ఆరాధించే ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్‌ని ఔరంగజేబు క్రూరంగా హింసించడాన్ని సినిమాలో చూపించారు. ఇదే ఇప్పుడు వివాదంగా మారింది. ఈ సినిమా రిలీజైన తర్వాత మహారాష్ట్రతో పాటు హిందువుల్లోనూ భావోద్వేగాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మరాఠా గడ్డపై ఔరంగజేబు సమాధిని తొలగించాలనే నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ డిమాండ్ తోనే మహారాష్ట్రలోని నాగ్ పూర్ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఛావా సినిమాను నిషేధించాలని ముస్లిం మత గురువు మౌలానా షాబుద్దీన్ రజ్వీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఛావా సినిమా మతపరమైన అల్లర్లు సృష్టించేలా ఉందని అందుకే ఈ సినిమాను ప్రదర్శించకుండా బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

‘ఛావా చిత్రంలో ఔరంగజేబు పాత్ర హిందూ యువతను రెచ్చగొట్టే విధంగా ఉంది. ఈ కారణంగానే నాగ్‌పూర్ లో మత హింస చెలరేగింది. ఛావా సినిమా విడుదలైనప్పటి నుంచి దేశంలో వాతావరణం క్షీణించింది. ఔరంగజేబును హిందూ వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా హిందూ యువతను రెచ్చగొట్టారు. అందుకే హిందూ సంస్థల నాయకులు వివిధ ప్రదేశాల్లో ఔరంగజేబు గురించి విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ఇందుకు కారకులైన ఛావా రచయితలు, దర్శకుడు, నిర్మాతలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అని రజ్వీ లేఖలో డిమాండ్ చేశారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఛావా థియేటర్లలో..

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.