తన మ్యూజిక్‌తో సంగీతాభిమానులను ఉర్రూతలూగిస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయాడు ఎస్.ఎస్.థమన్. ఈ మధ్యన ఆయన బీజీఎం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లతో సినిమాలను మరో రేంజ్‌కు తీసుకెళుతున్నాడు. బాలయ్యతో తీసిన అఖండ, వీరసింహారెడ్డి సినిమాలే ఇందుకు నిదర్శనం. కాగా థమన్‌కు క్రికెట్ అంటే బాగా ఆసక్తి. ఇటీవలే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లోనూ తెలుగు వారియర్స్ తరఫున మ్యాచ్‌లు ఆడి తనలోనూ ఓ క్రికెటర్ ఉన్నాడని నిరూపించుకున్నాడు. తాజాగా తాను ఎంతగానో అభిమానించే క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని కలిశాడు థమన్. అతనితో సరదాగా సెల్ఫీ కూడా దిగాడు. అనంతరం ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మై మ్యాన్.. మై క్రికెట్ గాడ్.. మన ఎస్ ధోనీ.. నా కళ నిజమైన వేళ.. నా హృదయం ఆనందంతో ఉరకలు వేస్తోంది.. అంటూ ధోనీతో దిగిన సెల్ఫీని షేర్ చేశాడు. మీ మిలియన్ల మంది వీరాభిమానుల్లో ఒకరైన (థమన్) అభిమానిని హ్యాపీగా ఉంచిన ప్రియమైన ఎంఎస్ ధోనీకి ధన్యవాదాలు.. నా కల నెరవేరేందుకు సహకరించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్‌కు ధన్యవాదాలు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు థమన్.
ప్రస్తుతం ధోని, థమన్ కలిసున్న ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసి అటు క్రికెట్ లవర్స్, ఇటు మ్యూజిక్ లవర్స్ తెగ సంబరపడిపోతుఉన్నారు. గతంలోనూ పలు సందర్భాల్లో ధోనినే తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకొచ్చాడు థమన్. ఇక సినిమాల విషయానికొస్తే.. సంక్రాంతికి వారసుడు, బాలయ్య వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు థమన్. ప్రస్తుతం రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్, అలాగే మహేశ్ బాబు నటిస్తోన్న ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28 సినిమాలకు స్వరాలు సమకూరుస్తున్నాడు.
MY MAN
MY CRICKET GOD ??
OUR @msdhoniIt’s A dream Coming Really True
Heart is jumping in Joy ?Thanks dearest #MSDhoni U Made One Of Your Millions & Billions of Truest Fans Happy ?♥️
Thanks to Our Honourable Respected
Cheif Minister Sir @mkstalin and Minister Dear… pic.twitter.com/fFxI6RXeqx— thaman S (@MusicThaman) May 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..