Irumudi Movie : ఇరుముడి సినిమాలో ఎక్కినాడు పల్లకి సాంగ్ రీమిక్స్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే సంక్రాంతి పండగ సందర్భంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్నారు.

Irumudi Movie : ఇరుముడి సినిమాలో ఎక్కినాడు పల్లకి సాంగ్ రీమిక్స్.. క్లారిటీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్..
Irumudi

Updated on: Mar 21, 2026 | 12:03 PM

ఈ ఏడాది ప్రారంభంలోనే సంక్రాంతి పండగ సందర్భంగా భక్త మహాశయులకు విజ్ఞప్తి చిత్రంతో అడియన్స్ ముందుకు వచ్చారు మాస్ మహారాజా రవితేజ. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. డింపుల్ హయాతి, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తర్వాత రవితేజ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్స్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ చిత్రం కథనం సాగుతుంది.

ఎక్కువ మంది చదివినవి : RP Patnaik: ఆ పాటకు రాత్రంతా డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు.. అది ఎప్పటికీ మర్చిపోలేను.. మ్యూజిక్ డైరెక్టర్..

ఈ సినిమాలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర కనిపించనుంది. ఇటీవల విడుదలైన టైటిల్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అయితే మొదటి నుంచి ఇరుముడి సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. తాజాగా దీనిపై మ్యూజిక్ డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. జీవీ ప్రకాష్ హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ హ్యాపీ రాజ్. ఈ సినిమా టైటిల్ విడుదల కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన… అనంతరం విలేకరులతో ముచ్చటించారు. ఈ క్రమంలోనే ఇరుముడి సినిమా గురించి ప్రశ్నించగా ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Suddala Ashok Teja : ఫిట్‏గా ఉన్న శ్రీహరి చిక్కిపోయి చనిపోవడానికి అసలు కారణం అదే.. రచయిత సుద్దాల అశోక్ తేజ..

ఈ సినిమాలో అయ్యప్ప భక్తులకు ఎంతో ఇష్టమైన ఎక్కినాడు పల్లకి సాంగ్ రీమిక్స్ చేస్తున్నారా అని ప్రశ్నించగా.. జీవీ ప్రకాష్ మాట్లాడుతూ.. ఈ పాటను రీమిక్స్ చేయమని ఇప్పటికే తనకు చాలా రిక్వెస్ట్స్ వచ్చాయని అన్నారు. దీంతో తాను కూడా ఈ పాటను చాలా సార్లు విన్నానని.. అయితే ఈ విషయంపై దర్శకుడు, నిర్మాతల నిర్ణయమని చెప్పుకొచ్చారు.

ఎక్కువ మంది చదివినవి : హీరోయిన్ ఛాన్స్ వస్తే వద్దని చెప్పింది.. బుల్లితెరపై గ్లామర్ అరాచకం..

ఎక్కువ మంది చదివినవి : Trending Folk Song : ఏం సాంగ్ రా బాబూ.. నెల రోజులుగా యూట్యూబ్‏లో గత్తరలేపుతుంది.. డీజేలో మోగిపోతున్న పల్లె పాట..

Follow Us