అమ్మకు ప్రేమతో..గుడిలేని దేవతవు నీవే కదా: దేవీ శ్రీ ప్రసాద్

రాక్ స్టార్ దేవిశ్రీ..ఈ యువ సంగీత దర్శకుడి గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎప్పుడూ లెక్కకు మించి సినిమాలకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందిస్తూ సినిమా స్థాయిని పెంచుతాడు. ఈ మ్యూజిక్ డైరక్టర్ చాలా ఎమోషనల్ అని బయట టాక్. అందరితో కలిసిమెలిసి ఉండటం..తేడా వస్తే మోహం మీదే కటీఫ్ చెప్పడం అతడి స్టైల్. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా ఆయన తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతుంటారు. ఎవరికి విష్ చేసినా ‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ […]

అమ్మకు ప్రేమతో..గుడిలేని దేవతవు నీవే కదా: దేవీ శ్రీ ప్రసాద్
Devi Sri Prasad Mother Birthday

Updated on: Aug 27, 2019 | 8:12 PM

రాక్ స్టార్ దేవిశ్రీ..ఈ యువ సంగీత దర్శకుడి గురించి స్పెషల్‌గా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనిలేదు. ఎప్పుడూ లెక్కకు మించి సినిమాలకు బ్లాక్ బాస్టర్ మ్యూజిక్ అందిస్తూ సినిమా స్థాయిని పెంచుతాడు. ఈ మ్యూజిక్ డైరక్టర్ చాలా ఎమోషనల్ అని బయట టాక్. అందరితో కలిసిమెలిసి ఉండటం..తేడా వస్తే మోహం మీదే కటీఫ్ చెప్పడం అతడి స్టైల్. అంతేకాదు ఇండస్ట్రీలో ఎవరిదైనా పుట్టినరోజు ఉన్నా ఆయన తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతుంటారు. ఎవరికి విష్ చేసినా ‘హ్యాపీయెస్ట్ మ్యూజికల్ బర్త్‌డే’ అంటూ విష్ చేస్తారు. ఈరోజు దేవిశ్రీ మదర్ శిరోమణి పుట్టినరోజు. ఈ సందర్భంగా  తన తల్లికి సర్‌ప్రైజింగ్‌గా విషెస్ తెల్పారు దేవీ శ్రీ, ఆయన సోదరుడు సాగర్. ఆ అనుభూతులను క్లబ్ చేస్తూ ట్విట్టర్‌లో ఓ ఎమోషనల్ వీడియోను ఫోస్ట్ చేశారు. నిజంగా ఆ వీడియో, మ్యూజిక్ హృదయాలను తాకుతుంది.