Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..

ఒకప్పుడు హీరోగా కెరీర్ ప్రారంభించి ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారు మురళి మోహన్. ఆ తర్వాత సహయ నటుడిగా అలరించారు. తక్కువ సమయంలోనే కోట్లాది మంది ప్రజల హృదయాలు గెలుచుకున్న ఆయన.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ఆయన వారంలో ఏడు రోజులు ఏడు వేర్వేరు దేవతలను పూజిస్తూ, "సర్వే జీవా సుఖినో భవంతు" అని ప్రార్ధిస్తానని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్యతో తనకున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

Murali Mohan: ఆరోజు బాలకృష్ణ చేసిన పని ఇప్పటికీ మర్చిపోలేను.. ఉదయాన్నే 5 గంటల వరకే.. మురళిమోహన్ కామెంట్స్..
Murali Mohan, Balakrishna

Updated on: May 17, 2026 | 4:58 PM

నటుడు మురళీ మోహన్ తన ఆధ్యాత్మిక ప్రస్థానం, దైవబలంపై తన దృక్పథం, అలాగే సహనటుడు బాలకృష్ణ దైవభక్తి క్రమశిక్షణ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సూర్యుడు లేనిదే జీవం లేదని, ఆయన్ను “ప్రత్యక్ష నారాయణుడు” అని అన్నారు. అందుకే తాను సూర్యుడిని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తానని తెలిపారు. మురళీ మోహన్ తన దైనందిన పూజలో ఒక ప్రత్యేక క్రమశిక్షణను పాటిస్తారని అన్నారు. సోమవారం శివపూజ, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం అయ్యప్ప, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యభగవానుడిని పూజిస్తానని తెలిపారు. ఇది కాలేజీలో టైమ్‌టేబుల్‌ వేసుకున్న విధంగా ఉంటుందని, ప్రతి రోజు ఆ ప్రత్యేక దైవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పూజిస్తానని వివరించారు. ఈ ఆధ్యాత్మికత తనకు ఆత్మ సంతృప్తిని ఇచ్చిందని, గురువుల ఉపదేశం లేకుండానే స్వయంగా అలవరచుకున్న పూజా విధానమని పేర్కొన్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

బాలకృష్ణ క్రమశిక్షణను గురించి వివరిస్తూ, జై సింహా సినిమా షూటింగ్ సమయంలో కుంభకోణంలో జరిగిన సంఘటనను ఉదహరించారు. తాను ఉదయం ఐదు గంటలకు వాకింగ్‌కు వెళ్ళేసరికి, బాలకృష్ణ అప్పటికే వాకింగ్, జిమ్ పూర్తి చేసుకుని వెళ్తుండేవారని చెప్పారు. బాలకృష్ణ తనకంటే ముందుగానే దైవపూజ, ఇతర కార్యకలాపాలు పూర్తి చేసుకునేవారని, ఆయన క్రమశిక్షణ ఎన్టీ రామారావు ప్రేరణతో వచ్చి ఉండవచ్చని మురళీ మోహన్ అన్నారు. బాలకృష్ణకు తిథులు, నక్షత్రాలు, మంచి-చెడులు, ప్రయాణ సమయాలపై పూర్తి అవగాహన ఉందని, వాటిని పక్కాగా పాటిస్తారని వెల్లడించారు.

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

బాలకృష్ణను చూసి తాను కూడా పూజ చేయకుండా ఏ పనిమీద వెళ్లనని, ఢిల్లీ వెళ్లాల్సి వచ్చినా తెల్లవారుజామున మూడు గంటలకు లేచి స్నానం చేసి పూజ చేసుకున్న తర్వాతే బయలుదేరతానని మురళీ మోహన్ తెలిపారు. ఎంపీగా ఉన్న ఐదేళ్లు కూడా ఈ నిత్య కృత్యాన్ని పాటించానని ఆయన గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో తన గొంతు పీలగా ఉండేదని, వోకల్ ఎక్సర్‌సైజ్‌లు చేయాలని సలహా ఇచ్చారని చెప్పారు. పూజ సమయంలో బిగ్గరగా చదవడం వల్ల గొంతుకు సంబంధించిన ఇబ్బందులు తొలగి, వాయిస్ బాగా సెట్ అయ్యిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

Follow Us