Mrunal Thakur: ఆమె నా ఇన్‌స్పిరేషన్.. ఇద్దరిలో ఒకటే కామన్ అంటూ సంచలన కామెంట్ చేసిన మృణాళ్​ ఠాకూర్

ఆమె ‘సీతారామం’ సినిమాలో సీతగా కనిపించి తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం టాలీవుడ్​లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. అయితే ఇంతటి క్రేజ్ సంపాదించుకున్న ఈ నటికి కూడా ఒక రోల్ మోడల్ ఉంది.

Mrunal Thakur: ఆమె నా ఇన్‌స్పిరేషన్.. ఇద్దరిలో ఒకటే కామన్ అంటూ సంచలన కామెంట్ చేసిన మృణాళ్​ ఠాకూర్
Mrunal Thakur And Hollywood Heroine

Updated on: Jan 27, 2026 | 9:01 PM

తనకు కష్టకాలం ఎదురైనప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ మాటలే ధైర్యాన్ని ఇస్తాయని ఆమె చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ గ్లోబల్ స్టార్ ప్రయాణం తనకెంతో స్ఫూర్తినిస్తుందని, ఆమె ఇంటర్వ్యూలను ఒక్కటి కూడా వదలకుండా చూస్తానని ఈ ‘సీత’ బయటపెట్టింది. అసలు ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏంటి? రాజమౌళి సినిమాలో ఆ గ్లోబల్ స్టార్ చేయబోతున్న ఆసక్తికర పాత్ర విశేషాలేంటో తెలుసుకుందాం. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. మృణాళ్ ఠాకూర్.

ప్రియాంక చోప్రా నా స్ఫూర్తి..

టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న మృణాళ్ ఠాకూర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక చోప్రాపై ప్రశంసలు కురిపించింది. “ప్రియాంక చోప్రా లైఫ్ జర్నీ నాకు పెద్ద ఇన్​స్పిరేషన్. ఆమె ఇంటర్వ్యూలను నేను ఎప్పుడూ మిస్ అవ్వను. ప్రతి విషయాన్ని ఫాలో అవుతుంటాను. ప్రియాంక ప్రయాణం, నా ప్రయాణం వేరు కావొచ్చు.. కానీ మా ఇద్దరిలో ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది. మేమిద్దరం కష్టకాలంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా, ఎంతో కృషి, పట్టుదలతో ముందడుగు వేశాం” అని మృణాళ్ వెల్లడించింది.

ప్రియాంక చోప్రా మాట్లాడే విధానం, యువతకు ఆమె ఇచ్చే సూచనలు తనకు చాలా బాగా నచ్చుతాయని మృణాళ్ తెలిపింది. “ప్రియాంక చోప్రా లాంటి మహిళలు సినిమా ఇండస్ట్రీకి రావడం చాలా అవసరం. ఇలాంటి మహిళలు ఇంకా చాలామంది రావాలి” అంటూ తన అభిమానాన్ని చాటుకుంది. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు గ్లోబల్ రేంజ్​లో గుర్తింపు పొందిన ప్రియాంకను చూసి మృణాళ్ గర్వపడుతోంది.

Mrunal Thakur And Priyanka

చాలా కాలంగా ఇండియన్ సినిమాలకు దూరంగా ఉంటున్న ప్రియాంక చోప్రా, ఇప్పుడు నేరుగా దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్​తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా రాబోతున్న భారీ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’లో ప్రియాంక ఒక కీలక పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ఆమె ‘మందాకిని’ అనే పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. గ్లోబల్ స్టార్ ప్రియాంక, సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఇక మృణాళ్ ఠాకూర్ విషయానికి వస్తే, తెలుగులో ఆమె ‘డెకాయిట్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు పలు బాలీవుడ్ ప్రాజెక్టులలోనూ నటిస్తోంది. తమిళ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెడుతూ తన కెరీర్​ను విభిన్నంగా ప్లాన్ చేసుకుంటోంది. ప్రియాంక చోప్రాను స్ఫూర్తిగా తీసుకుని, మృణాళ్ కూడా గ్లోబల్ లెవల్​లో రాణించాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఒక నటి మరో నటిని ఇంతగా మెచ్చుకోవడం నిజంగా అభినందనీయం. కష్టపడి పైకి వచ్చిన ప్రియాంక చోప్రా బాటలోనే తాను కూడా పయనిస్తానని మృణాళ్ నిరూపిస్తోంది.