Shaadi Mubarak Movie Pre Release Event: మొగిలిరేకులు ఫేం సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’. ప్రీరిలీజ్ ఈవెంట్ మీ టీవీ9 లైవ్‏లో…

|

Mar 03, 2021 | 8:01 PM

చక్రవాకం, మొగిలి రేకులు సీరియల్లు ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ఆడవాళ్లే కాకుండా ఈ సీరియల్స్ గురించి ప్రతివారికి తెలుసు.

Shaadi Mubarak Movie Pre Release Event: మొగిలిరేకులు ఫేం సాగర్ హీరోగా షాదీ ముబారక్. ప్రీరిలీజ్ ఈవెంట్ మీ టీవీ9 లైవ్‏లో...
Follow us on

చక్రవాకం, మొగిలి రేకులు సీరియల్లు ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ఆడవాళ్లే కాకుండా ఈ సీరియల్స్ గురించి ప్రతివారికి తెలుసు. ఈ సీరియల్ పేర్లు వినగానే.. ఇంట్లో ఆడాళ్లు తిండి పెట్టక కడుపు మాడ్చిన రోజులు మగాళ్లకు గుర్తుకురావచ్చు. కాని ఆడాళ్లకు మాత్రం ఆ సీరియల్లలోని క్యారెక్టర్లు వాళ్ల తాలూకు ఎమోషన్‌ సీన్లు మదిలో మెదులుతూనే ఉంటాయి. ఆ సీరియల్లో నటించిన ఆర్కే నాయుడే.. గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. ఇక అప్పట్లో సినిమా హీరోల స్థాయిలో సాగర్‌కు సూపర్ పాపులారిటీ తీసుకొచ్చింది… మొగిలిరేకులు సీరియల్లో ఆర్కే నాయుడు క్యారెక్టర్. అంతే కాదు. ఈ సీరియల్ తరువాత మనోడే ఏకంగా సాగర్‌ ఆర్కే నాయుడు గానే అందరూ నాయకరణం చేశారు కూడా. అంతలా పాపులారిటీ సంపాదించిన సాగర్.. ‘షాదీ ముబారక్‌’ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలుగా… పద్మశ్రీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో సాగర్‌కు జోడీగా దృశ్య రఘనాథ్‌ జంటగా నటించింది. అయితే రీసెంట్గా రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌ అందరినీ ఆక్టటుకుంటూ.. యూట్యూబ్లో వైరల్‌గా మారింది. హీరోగా ఆర్కేనాయుడు సూపర్ లుక్‌లో తెరపైకి రావడం ఈ సినిమాకి హైలెట్‌ అయితే.. హీరో హీరోయిన్‌ల మధ్య రొమాంటిక్‌ కామెడీ సీన్లు ఎక్కువగా కార్‌లోనే షూట్‌ చేయడం మరో హైలెట్. వీటికి తోడు.. టాలీవుడ్ స్టార్‌ ప్రొడ్యూసర్‌ ఈ సినిమాను నిర్మించడం మరో హైలెట్. టాలీవుడ్లో ఎన్నో సూపర్‌ హిట్టు సినిమాలను ప్రొడ్యూస్‌ చేసిన దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటి వరకు భారీ బడ్జెట్‌ సినిమాలు చేసుకుంటూ పోయిన దిల్ రాజు.. కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం కోసం చిన్న సినిమాలు కూడా తెరకెక్కించేందుకు నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. షాదీముబారక్‌ సినిమా డైరెక్టర్‌ పద్మశ్రీ .. ఈ కథను తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చేలా.. తెరకెక్కించాడు. ఇక ఈ మూవీ ప్రీరిలిజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 7.15 నిమిషాలకు జరగనుంది. ఈ కార్యక్రమాన్ని tv9 లైవ్‏లో వీక్షించవచ్చు.