Kannappa: కన్నప్ప‌ సినిమాలో కొత్త హీరోయిన్.. ఆ క్యూటీ ప్లేస్‌లోకి ఈ బ్యూటీ

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో మొదలు అయ్యింది. సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరగుతుంది. ఇటీవలే బ్రహ్మానందం ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది.

Kannappa: కన్నప్ప‌ సినిమాలో కొత్త హీరోయిన్.. ఆ క్యూటీ ప్లేస్‌లోకి ఈ బ్యూటీ
Kannappa

Updated on: Dec 15, 2023 | 8:50 AM

మంచు విష్ణు తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. జిన్నా సినిమాతర్వాత మంచు విష్ణు నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో మొదలు అయ్యింది. సినిమాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ అక్కడ జరగుతుంది. ఇటీవలే బ్రహ్మానందం ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చాలా మంది నటీనటులు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఇంతవరకు దీని పై క్లారిటీ మాత్రం రాలేదు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.

ఇప్పటికే కన్నప్ప నుంచి విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ప్రియులను ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయ్యింది. కన్నప్ప సినిమాలో హీరోయిన్ గా ఓ మోడల్ నటిస్తున్నారని తెలుస్తోంది.

ఇక కన్నప్ప సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కృతిసనన్ సిస్టర్ నుపుర్ సనన్ నటిస్తుందని టాక్ వినిపించింది. అయితే ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమానుంచి తప్పుకుంది. ఆమె ప్లేస్ లో ఇప్పుడు మోడల్, క్లాసిక్ డ్యాన్సర్, భరత నాట్యంలో ప్రావీణ్యురాలైన ప్రీతి ముకుందన్‌ను ఎంపిక చేశారు. త్వరలోనే ఆమె షూటింగ్ లో జాయిన్ కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంచు విష్ణుకు గాయం కావడం ఆ తర్వాత ప్రముఖ కొరియోగ్రాఫ్ కు యాక్సిడెంట్ కావడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. అలాగే ప్రభాస్ ఈ సినిమాలో శివుడిగా నటిస్తున్నారని అలాగే నయనతార పార్వతిగా నటిస్తుందని టాక్. అలాగే మోహన్ లాల్, శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..