రోజమ్మకు అంతా శుభమే.. భర్త సెల్వమణికి కీలక పదవి!

|

Jul 22, 2019 | 12:41 PM

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజూకు ఒకప్పుడు రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. ఆమె ఎటువైపు ఉంటే ఆ పార్టీ ఓడిపోతుందని..ఆమెది ఐరన్ లెగ్ అని వైరి పక్షాలు విమర్శిస్తూ ఉండేవి. అయితే  గత ఎన్నికల నుంచి రోజా ఫేట్ పూర్తిగా మారిపోయింది. నగరి నుంచి  వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె మంచి మెజార్టీతో విజయం సాధించింది. అంతేనా ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 151 సీట్ల భారీ మెజార్టీతో ఏపీలో అధికారం […]

రోజమ్మకు అంతా శుభమే.. భర్త సెల్వమణికి కీలక పదవి!
Follow us on

వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజూకు ఒకప్పుడు రాజకీయాల్లో ఒక ముద్ర వేశారు. ఆమె ఎటువైపు ఉంటే ఆ పార్టీ ఓడిపోతుందని..ఆమెది ఐరన్ లెగ్ అని వైరి పక్షాలు విమర్శిస్తూ ఉండేవి. అయితే  గత ఎన్నికల నుంచి రోజా ఫేట్ పూర్తిగా మారిపోయింది. నగరి నుంచి  వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె మంచి మెజార్టీతో విజయం సాధించింది. అంతేనా ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైసీపీ 151 సీట్ల భారీ మెజార్టీతో ఏపీలో అధికారం దక్కించుకుంది.  దాంతో నాది గోల్డెన్ లెగ్ అంటూ తనపై వచ్చిన విమర్శలకు ధీటుగా బదులిచ్చారు రోజా.  అయితే ఆమె ఎంతగానే ఆశపెట్టుకున్న మంత్రి పదవి మాత్రం రాలేదు. దీంతో ఆమె నైరాశ్యంలోకి వెళ్లిపోయింది. పరిస్థితి అర్థం చేసుకున్న జగన్..ఆమె పార్టీకి చేసిన సేవలకు గాను ఏపీఐఐసీ పదవిని కట్టబెట్టారు. అంతేనా..కాబినెట్ ర్యాంకును కూడా ఎలాట్ చేశారు.

అయితే ఇప్పుడు ఎమ్మెల్యే రోజా భర్తకు కూడా ఓ పదవి లభించడం విశేషం. అయితే రోజా భర్తకు దక్కింది రాజకీయ పదవి కాదు.. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినది.  రోజా భర్త ఆర్కే సెల్వమణి తమిళనాడు సినీ దర్శకుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. హోరా హోరీగా సాగిన ఈ ఎన్నికల్లో సెల్వమణి భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం.

గత జూన్ నెలలోనే తమిళనాడు దర్శకుల సంఘానికి ఎన్నికలు జరిగాయి. భారతీరాజా ఏకగ్రవంగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఆయన ఎన్నికపై వివాదం చెలరేగడం.. కొందరు అభ్యంతరం తెలుపడంతో భారతీరాజా తప్పుకున్నారు. మళ్లీ ఎన్నికలు నిర్వహించగా సెల్వమణి మరో తమిళ దర్శకుడు విద్యాసాగర్‌పై గెలుపొందారు. మొత్తం 1900 ఓట్లు ఉండగా.. 1503మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. సెల్వమణి 1386ఓట్ల భారీ మెజార్టీతో గెలవడం గ్రేట్ అంటున్నారు ఇండస్ట్రీ పెద్దలు.