Megastar Chiranjeevi: లండన్లో విహరిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ .. మెగా క్వీన్ ‘క్లీంకార’ ఫేస్ రివీల్
ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మెగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ లభించడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు బయలు దేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్లో విహరిస్తున్నారు
![Megastar Chiranjeevi: లండన్లో విహరిస్తోన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ .. మెగా క్వీన్ 'క్లీంకార' ఫేస్ రివీల్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/megastar-chiranjeevi-famil.jpg?w=1280)
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. బింబిసార వంటి పీరియాడికల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వశిష్ట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచెరస్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మెగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ నుంచి కాస్త గ్యాప్ లభించడంతో ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు బయలు దేరి వెళ్లారు మెగాస్టార్ చిరంజీవి. తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్లో విహరిస్తున్నారు. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. అలాగే తన లండన్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అలా తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో చిరంజీవి ఫ్యామిలీ కలిసి దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇందులో మెగా క్వీన్ క్లింకారా కొణిదెల ఫేస్ కొంచెం మాత్రమే కనిపించింది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది.
ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న చిరంజీవి.. ఒలింపిక్స్ ఆరంభ ఈవెంట్ కోసం పారిస్కు వెళ్తున్నట్లు తెలిపారు. రేపటిలోగా అక్కడికి చేరుకుంటామని వెల్లడించారు. ఈనెల 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ఫొటోలో క్లింకారా ఫేస్ కొంచం కనిపించింది. ఈ ఫోటో నెట్టింట వైరల్గా మారింది.
Relishing a serene moment with family and the grand little one Klin Kaara at Hyde Park London, en route our journey to Paris tomorrow!
Summer Olympics 24 Inaugural Event Beckons 🙂 pic.twitter.com/bFa31zBh3a
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 24, 2024
మరోవైపు గేమ్ ఛేంజర్ లో తన షూటింగ్ పార్ట్ పూర్తి కావడంతో గత కొన్ని రోజులుగా లండన్ లోనే ఉంటున్నారు రామ్ చరణ్- ఉపాసన. లండన్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చెర్రీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాడీ కొలతలు ఇచ్చేందుకు అక్కడకు వెళ్లాడని తెలుస్తోంది. అలాగే బుచ్చి బాబు తెరకెక్కిస్తోన్న పెద్ది సినిమా కుసంబంధించిన బాడీ బిల్డింగ్ కోసం లండన్ లోనే చెర్రీ ఉన్నట్లు సమాచారం.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.