చాలా వరకు మన దేశానికి చెందిన నటుల్లో కొందరు హాలీవుడ్ లేదా ఇతర దేశాల సినిమాల్లో కనిపిస్తే మనకెప్పుడు మంచి ఎగ్జైటింగ్ గానే అనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న ఓ సినిమాలో పాకిస్తాన్ నటి సజల్ అలీ నటిస్తుంది అని కొన్ని గాసిప్స్ బయటకి వచ్చాయి.
కాగా ఈమె ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్ సినిమాలో ఆమె నటిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ బయటకి వచ్చింది.
సజల్ అలీకి చాలా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లలో నటించిన అనుభవం ఉంది. గతంలో బాలీవుడ్‌లో ‘మామ్’ సినిమాలో నటించింది. తన అందంతో అభిమానుల మనసు దోచుకుంది.
ప్రభాస్ కొత్త సినిమాలో సజల్ అలీనే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
కాగా ఓ పాకిస్థానీ నటిని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రశ్నకు చిత్రబృందం సమాధానం చెబుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇలా ఈ పాకిస్తాన్ బ్యూటీ ప్రభాస్ సరసన నతిష్టించే ఛాన్స్ కొట్టేసినట్టుగా తెలుస్తుంది. ఇక ప్రభాస్ తో హను రాఘవపూడి చేస్తున్న సినిమాకి "ఫౌజి" అనే టైటిల్ అంటుకుంటున్నారట.