Mana Shankara Vara Prasad Garu: ఈ సంక్రాంతి తెలుగు పరిశ్రమది కావాలి.. పొంగల్ పోటీపై మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా మన శంకరవరప్రసాద్ గారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (జనవరి 08) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

Mana Shankara Vara Prasad Garu: ఈ సంక్రాంతి తెలుగు పరిశ్రమది కావాలి.. పొంగల్ పోటీపై మెగాస్టార్ చిరంజీవి
Mana Shankara Vara Prasad Garu Pre Release Event

Updated on: Jan 08, 2026 | 6:30 AM

మెగాస్టార్ చిరంజీవి, టాప్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మన శంకరవరప్రసాద్ గారు. లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో బుధవారం (జనవరి 07) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. చిరంజీవి, వెంకటేశ్ లతో పాటు చిత్ర బృందమంతా ఈ వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఈ సంక్రాంతి తెలుగు పరిశ్రమది కావాలి. ప్రభాస్‌ రాజాసాబ్‌ ఆడాలి. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆడాలి
శర్వానంద్‌ నారీ నారీ నడుమ మురారి ఆడాలి. నా శిష్యుడు నవీన్‌ పోలిశెట్టి సినిమా కూడా ఆడాలి. అందరి సినిమాలూ సంక్రాంతికి సూపర్‌ హిట్‌ కావాలి. ఇండస్ట్రీలో అందరూ సుభిక్షంగా ఉండాలి. అదే నిజమైన సంక్రాంతి… అలాంటి సంక్రాంతి రావాలి. 2026 సంక్రాంతిని తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. కామెడీ, ఫ్యామిలీ జోనర్లతో ఈ సంక్రాంతికి సినిమాలొస్తున్నాయి. అన్నీ సినిమాలనూ ఆడేలా చేసే బాధ్యత ప్రేక్షకులది. థియేటర్లకు వెళ్లే అన్నీ సినిమాలనూ చూడండి.

‘అనిల్‌తో నేను సినిమా చేయాలని రాఘవేంద్రరావు ఎప్పటి నుంచో చెప్పేవారు. ఆయన చేతుల మీదుగానే ఈ మూవీ మొదలైంది. ఘరానా మొగుడులా హిట్‌ కావాలని ఆయన ఆకాంక్షించారు. హీరోయిన్లున్నప్పుడు సెట్‌కి వస్తానని రాఘవేంద్రరావు అనేవారు. వింటేజ్‌ చిరు కావాలని అనిల్‌ రావిపూడి చెప్పేవారు. ఈ జనరేషన్‌కి వింటేజ్‌ చిరుని గుర్తుచేయాలన్నారు అనిల్‌. కేక్‌ వాక్‌ అని అనిపించింది నాకు. చక్కటి హోమ్‌ వర్క్ చేశారు అనిల్‌ రావిపూడి. షూటింగ్‌ లాస్ట్ రోజు ఎమోషనల్‌గా ఫీలయ్యాను. ఆఖరి రోజు కాలేజీ వదిలినట్టు.. ఫేర్‌వెల్‌ లాగా ఫీలయ్యా. ప్రతిరోజూ ఎక్స్ కర్షన్‌కి వెళ్లినట్టు షూట్‌ చేశాం. ఈ మధ్య కాలంలో ఇంత సరదాగా జరిగిన సినిమాలు లేవు. ఈ సినిమా ఆల్రెడీ సూపర్‌ హిట్‌ అయింది. బడ్జెట్‌, కాల్షీట్‌ పరంగా అనుకున్నదానికన్నా తక్కువలోనే చేశారు
ఈ రకంగా జరిగే సినిమాల సంఖ్య చాలా తక్కువ. జీవితం పరమావధి ఏంటో వెంకటేష్‌కి బాగా తెలుసు. మోడ్రన్‌ డేస్‌ గురువులాగా ఉంటాడు వెంకీ. సినిమాను, వ్యక్తిగత జీవితాన్ని చాలా బాగా బ్యాలన్స్ చేసుకుంటాడు. వెంకీతో నేను తీసుకున్న స్టిల్స్ ఎవరో లీక్‌ చేశారు. అనిల్‌ మాత్రమే మమ్మల్ని జస్టిఫై చేయగలడు. వెంకీతో ఇద్దరం చాలా చాలా ఎంజాయ్‌ చేశాం. 18 రోజులు మేమిద్దరం కలిసి చేశాం. ఈ కాంబినేషన్‌ పూర్తి స్థాయిలో జరగడానికి నేను రెడీ. అనిల్‌ మా ఇద్దరి కోసం స్టోరీ రాసుకో. మేమిద్దరం ప్రాణం పెట్టి సినిమా చేస్తాం. నయన్‌ ఈ సినిమా టైమ్‌లో చాలా బాగా కలిసిపోయింది. నయన్ రెచ్చిపోయి ప్రమోషన్లు చేయడమేంటని అనిల్‌ని అడిగాను. సినిమాలో హుక్‌ స్టెప్‌ హైలైట్‌ అవుతుంది’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.