మోస్ట్ అవైయిటెడ్ ఫిల్మ్ లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha). బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోస్ మూవీపై హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా లాల్ సింగ్ చడ్డా ప్రేయసిని పరిచయం చేశారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). రూప ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను…వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’. అంటూ కరీనా కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ చిత్రాన్ని తెలుగులో చిరు సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మెగాస్టార్ ఇంట్లో లాల్ సింగ్ చడ్డా ప్రివ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ రాజమౌళి, సుకుమార్, అక్కినేని నాగార్జున, నాగచైతన్య, అమీర్ ఖాన్ సమక్షంలో ఈ సినిమా ప్రివ్యూ నిర్వహించారు. అనంతరం చైతూ, అమీర్ నటనపై ప్రశంసలు కురింపించారు చిరు. ఈ చిత్రాన్ని హిందీతోపాటు, తెలుగు, తమిళం భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయనున్నారు.
‘లాల్ సింగ్ చడ్డా’ ప్రేయసి ‘రూప’ని మీకు పరిచయం చేస్తున్నాను…వీళ్లిద్దరి బంధం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ముద్దపప్పు-ఆవకాయ’.
Introducing Rupa from #LaalSinghChaddha #Rupa #KareenaKapoorKhan #AamirKhan @AKPPL_Official @Viacom18Studios @chay_akkineni #11August22Release pic.twitter.com/fcKUJ4QTy3
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 18, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.