Telugu News Entertainment Tollywood Megastar Chiranjeevi, Pawan Kalyan, Venkatesh Daggubati and Nagarjuna come together to attend grand wedding in Hyderabad. See photos, videos
Tollywood: ఘనంగా ‘లవ్ స్టోరీ’ నిర్మాత కూతురు పెళ్లి.. తరలివచ్చిన తారాలోకం.. ప్రత్యేక ఆకర్షణగా మెగా బ్రదర్స్ చిరు, పవన్‌లు
సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ పెళ్లికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులు హజరయ్యారు. పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవితో రాగా, నాగార్జున తన కొడుకు నాగ చైతన్యతో కనిపించారు . వెంకటేష్ దగ్గుబాటి, నటుడు నాని , మేజర్ ఫేమ్ అడివి శేష్ హాజరయ్యారు.
Tollywood: తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె జాన్వి వివాహం గురువారం రాత్రి హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు దక్షిణాది సినీ తారా లోకం కదలి వచ్చింది. పెళ్లి వేడుకలలో కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు.. సినీ రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేశారు.
సునీల్ నారంగ్ కూతురు జాన్వీ నారంగ్ పెళ్లికి సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నటీనటులు హజరయ్యారు. పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ తన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవితో రాగా, నాగార్జున తన కొడుకు నాగ చైతన్యతో కనిపించారు . వెంకటేష్ దగ్గుబాటి, నటుడు నాని , మేజర్ ఫేమ్ అడివి శేష్ హాజరయ్యారు.
పెళ్లికి, చిరంజీవి గోల్డెన్ కుర్తా-పైజామాతో పవన్ కళ్యాణ్ పూర్తిగా తెల్లటి దుస్తులు ధరించి వచ్చారు. ఈ వేడుకల్లో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్‌కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. మెగా బ్రదర్స్ ఇద్దరును అందంగా కనిపించారు.
వెంకటేష్ పెళ్లికి క్యాజువల్ గా దుస్తుల్లో రాగా నాగ చైతన్య తెల్లటి షర్ట్, నీలిరంగు ప్యాంటులో అందంగా కనిపించాడు. చైతు తండ్రి నాగార్జున నల్ల చొక్కా, నల్ల ప్యాంటు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
— Pawan Kalyan Youth Force (@TeamPKYF) June 23, 2022
జాన్వీ నారంగ్ వివాహానికి హాజరైన తారల అనేక ఫోటోలు, వీడియోలను వారి అభిమానులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఓ వీడియోలో నటుడు శివకార్తికేయన్ పెళ్లిలో పవన్ కళ్యాణ్‌ని కౌగిలించుకుని అతనితో మాట్లాడుతున్నట్లు కనిపించింది.