Megastar Chiranjeevi: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు చిరంజీవి శుభాకాంక్షలు..

71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఆధ్వరంలో 2023 సంవత్సరానికి గానూ ఈ అవార్డులను ప్రకటించింది. పలు విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి.. టాలీవుడ్ నుంచి ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Megastar Chiranjeevi: జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలకు చిరంజీవి శుభాకాంక్షలు..
Chiranjeevi

Updated on: Aug 02, 2025 | 9:23 AM

భారతదేశ సినీరంగానికి అత్యంత ప్రతిష్టాత్మక గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. పలు విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరి మూవీ ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఎంపిక కావడంతో చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి సైతం సోషల్ మీడియా ద్వారా జాతీయ అవార్డ్ గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేశారు. “తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది.. ” అంటూ పోస్ట్ చేశారు.

  • ఉత్తమ చిత్రం: 12వ ఫెయిల్ (నిర్మాత-దర్శకుడు: విధు వినోద్ చోప్రా)
  • ఉత్తమ నటుడు: విక్రాంత్ మాస్సే (12వ ఫెయిల్), షారూఖ్ ఖాన్ (జవాన్)
  • ఉత్తమ నటీమణి: రాణి ముఖర్జీ ( మీసిస్ చాటర్జీ వర్సెస్ నార్వే)
  • ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)

తెలుగు నుంచి గెలుచుకున్న ముఖ్య అవార్డులు:

  • ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి (హీరో: బాలకృష్ణ, దర్శకుడు: అనిల్ రావిపూడి)
  • ఉత్తమ AVGC చిత్రం: హనుమాన్
  • ఉత్తమ స్క్రీన్ ప్లే: సాయి రాజేష్ (బేబీ)
  • ఉత్తమ బాలనటి: సుకృతి బండిరెడ్డి (గాంధీ తాత చెట్టు)
  • ఉత్తమ యాక్షన్ దర్శకత్వం: నందు-పృథ్వీ ( హనుమాన్)
  • ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్.. ఊరు పల్లెటూరు (బలం)

మరాఠీలో విడుదలై సంచలనం సృష్టించిన నాల్‌ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది.

  •  ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ
  •  బెస్ట్‌ సినిమాటోగ్రఫీ: లిటిల్‌ వింగ్స్‌ (తమిళ్‌)
  •  బెస్ట్‌ ఎడిటింగ్‌: మూవీంగ్‌ ఫోకస్‌ (ఇంగ్లీష్‌)
  •  బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: దుందగిరి కే ఫూల్‌ (హిందీ)
  •  బెస్ట్‌ బయోగ్రాఫికల్‌ ఫిల్మ్‌: మా బావు, మా గావ్‌ ఒడిశాకు చెందిన సినిమాకు దక్కాయి.

ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?