
Natyam : నృత్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటిస్తూ… నిర్మాతగా పరిచయం అవుతున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. నిశ్రింకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల తెలుగులో విలక్షణ మైన కథల హావ నడుస్తుంది. నిజజీవితాల ఆధారంగా తెరకెక్కుస్తున్న బయోపిక్ లు, వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నాట్యం సినిమా తెరకెక్కింది. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గరపడుతుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్రయూనిట్.
ఈ క్రమంలో నాట్యం సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు చిత్రయూనిట్. స్టార్ హీరోలచే టీజర్లు .. ట్రైలర్లు .. పాటలు రిలీజ్ చేయడంతో సినిమాకి ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ – శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నారు. అలాగే సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :