
మలయాళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి మీరా వాసుదేవన్, తన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా వైవాహిక జీవితం గురించి అనేక వివాదాలకు ఆమె కేరాఫ్ అడ్రస్ అయ్యింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆమె తన మూడో వివాహ బంధం బ్రేక్ కావడానికి గల కారణాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ నా మూడో భర్త నా కొడుకు పట్ల చూపిన ప్రేమ, శ్రద్ధ చూసి అతనితో ఈ బంధంలోకి అడుగుపెట్టా.. అతను నా కొడుకుకు మంచి తండ్రి అవుతాడని, నా కొడుకుకు ఒక మంచి తండ్రి దొరుకుతాడని బలంగా నమ్మాను అని చెప్పుకొచ్చింది.. అయితే, కాలక్రమేణా ఆమె అంచనాలు తప్పని తెలిశాయట. ఈ బంధం బ్రేక్ కావడానికి ప్రధాన కారణాలు తన భర్త మితిమీరిన ఆధారపడటం, అలాగే ఇద్దరి విలువల మధ్య తీవ్రమైన పొంతన లేకపోవడం అని మీరా స్పష్టం చేశారు. భార్యను తల్లిగా చూసి, ప్రతి విషయంలోనూ స్పూన్-ఫీడింగ్ లాంటి సంరక్షణను కోరుకునే పురుషులతో తాను ముందుకు వెళ్లలేనని ఆమె అన్నారు.
తన వివాహ జీవితాల గురించి మాట్లాడినప్పుడు, చాలా మందికి అది కేవలం గాసిప్ లా అనిపించవచ్చని, కానీ తనకు అది తన జీవితం అని మీరా ఎమోషనల్ గా తెలిపారు. సమాజం తనను మూడు పెళ్లిళ్లు చేసుకున్న స్త్రీ అని ముద్ర వేసినప్పుడు, తాను దానిని అధిగమించగలిగానని తెలిపారు. అందుకు కారణం ఇతరులు ఏమనుకుంటున్నారో తాను పట్టించుకోకపోవడమేనని వివరించారు. ఇతరుల అభిప్రాయాలు తనను ప్రభావితం చేయవనే నమ్మడమే తనలో గొప్ప మార్పును తీసుకువచ్చిందని, ఆ మార్పుకు తన ఆలోచనా విధానమే కారణమని మీరా చెప్పుకొచ్చారు.
అలాగే రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను 17 సంవత్సరాలు వృధా చేశానని, మూడు అర్థం పర్థం లేని పెళ్లిళ్ల కు తన సమయాన్ని కేటాయించానని తెలిపింది. ఈ సంవత్సరాల్లో తాను మరింత తెలివిగా వ్యవహరించి ఉండాల్సిందని ఆమె అన్నారు. తనకు నచ్చిన పనులు చేయడం, అంటే సినిమా, ఫిట్‌నెస్, ఒక మంచి కమ్యూనిటీని సృష్టించడం లేదా ఇతరులకు సేవ చేయడం వంటి వాటిపై దృష్టి సారించి ఉండాల్సిందని వాసుదేవన్ చెప్పుకొచ్చారు. తన తల్లిదండ్రులు, సోదరితో ఎక్కువ సమయం గడిపి ఉండవచ్చని తెలిపారు. తన సంబంధాలలో గౌరవం ఇవ్వని, తన శక్తిని విలువైనదిగా చూడని వ్యక్తులతో సమయాన్ని వృధా చేసుకున్నానని.. బాల్య లైంగిక వేధింపుల బాధితురాలిగా తన జీవితం కష్టతరంగా సాగిందని ఆమె అన్నారు.