Tollywood: అప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్.. ఇప్పుడు గూగుల్ కంపెనీకే బాస్.. ఎవరంటే..

సినీరంగంలో స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు ముద్దుగుమ్మలు ఆ తర్వాత అనుహ్యంగా సినిమాలకు దూరమవుతుంటారు. ఒకటి రెండు సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన తారలలో ఈ బ్యూటీ ఒకరు. ఒకప్పుడు ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించింది. కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది.

Tollywood: అప్పుడు మహేష్ బాబు సినిమాలో హీరోయిన్.. ఇప్పుడు గూగుల్ కంపెనీకే బాస్.. ఎవరంటే..
Mahesh Babu

Updated on: May 24, 2025 | 5:43 PM

సినీరంగంలో ఒకటి రెండు సినిమాలతోనే ఫేమస్ అయిన స్టార్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఒక్క మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. అందం, అభినయంతో తక్కువ సమయంలోనే తెలుగు అడియన్స్ హృదయాలను గెలుచుకున్న తారలు.. ఆ తర్వాత తమ క్రేజ్ కాపాడుకోవడంలో విఫలమవుతుంటారు. ఫస్ట్ మూవీ హిట్టైనప్పటికీ ఆ తర్వాత ప్లాప్స్ రావడంతో కెరీర్ కోల్పోయిన హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం అదే కోవకు చెందుతుంది. కెరీర్ తొలినాళ్లల్లో వరుసగా అవకాశాలు అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఓ మూవీలో నటించి తెలుగులో మరింత పాపులర్ అయ్యింది. కానీ సక్సెస్ మాత్రం అందుకోలేకపోయింది. వెండితెరపై కాకుండా బుల్లితెరపై సైతం పలు సీరియల్స్ చేసింది. కానీ అక్కడ కూడా సరైన బ్రేక్ రాలేదు. దీంతో సినిమాలకు దూరంగా మరో కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కట్ చేస్తే.. ఇప్పుడు గూగుల్ ఇండియా కంపెనీలో హెడ్ గా పనిచేస్తుంది.

గూగుల్ కంపెనీలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీగా వర్క్ చేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్ పేరు మయూరి కాంగో. ఈ పేరు చెబితే అడియన్స్ అస్సలు గుర్తుపట్టలేరు. కానీ మహేష్ బాబు నటించిన వంశీ సినిమాలో మహేష్ స్నేహితురాలు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో మహేష్ స్నేహితురాలు.. మోడల్ పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. 1995లో హిందీలో నసీమ్ అనే సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత హిందీలో పాపా కెహెతే హై, బేటాబీ, హోగీ ప్యార్ కీ జీత్, బాదల్, పాపా ది గ్రేట్, జంగ్, శికారీ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో అలరించిన మయూరి కాంగో.. తెలుగులో వంశీ చిత్రంలో మాత్రమే నటించింది. ఈ సినిమా తర్వాత ఆమెకు అంతగా ఆఫర్స్ రాలేదు.

2003లో ఎన్ఆర్ఐ ఆదిత్య థిల్లాన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని న్యూయార్క్ లో సెటిల్ అయ్యింది. సినిమాలకు దూరంగా ఉన్న మయూరి.. అక్కడే కాలేజ్ బరూచ్ కాలేజ్ జిక్లిన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆ తర్వాత గ్లోబల్ మీడియా ఏజెన్సీ పెర్ఫామిక్స్ అనే కంపెనీలో ఎండీ హోదాలో పనిచేసింది. ప్రస్తుతం ఆమె గూగుల్ ఇండియాలో హెడ్ ఆఫ్ ఇండస్ట్రీగా బాధ్యతలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం గూగుల్‌ డిజిటల్‌ స్ట్రాటజీస్‌, ఇన్నోవేషన్స్‌ విభాగంలో తన మార్క్ చూపిస్తుంది.

Mayoori Kango

ఇవి కూడా చదవండి :  

Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..

Megastar Chiranjeevi: అమ్మ బాబోయ్.. చిరంజీవి ఆపద్బాంధవుడు హీరోయిన్‏ గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్ అవ్వాల్సిందే..

OTT Movie: బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ.. 3 కోట్లతో తీస్తే రూ.70 కోట్ల కలెక్షన్స్.. 2 గంటలు నాన్‏స్టాప్ సస్పెన్స్..

Actress: ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన హీరోయిన్.. స్టార్ హీరోలతో సినిమాలు.. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్..