మాస్ మహారాజ రవితేజ(Ravi Teja) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఖిలాడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మాస్ మాహా రాజా. ఆ మధ్య రవితేజ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఆ సమయంలోనే గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి తిరిగి ఫామ్ లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో మాస్ రాజా ఈస్ బ్యాక్ అంటూ అనౌన్స్ చేశారు రవితేజ. ఇదే జోష్ లో వరుస సినిమాలను కమిట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఖిలాడి సినిమాను రిలీజ్ చేశారు. రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అనుకున్న రేంజ్ తో హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు రావణాసుర, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, టైగర్ నాగేశ్వరావు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. వీటితోపాటు మరికొన్ని కథలను కూడా మాస్ రాజా ఓకే చేశారని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా రవితేజ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక పై హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్స్ కూడా చేయాలనీ నిర్ణయించుకున్నారట ఈ ఖిలాడి. ఇతర హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇప్పటికే దర్శకులకు కూడా చెప్పేశారట. ఇదిలా ఉంటే రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడని చాలా రోజులుగా టాక్ వినిపిస్తుంది. అలాగే బాలకృష్ణ -అనిల్ రావిపూడి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ వినిపిస్తుంది. సపోర్టింగ్ రోల్స్ విషయంలో క్లారిటీ రావాలంటే రవితేజ స్పందించాల్సిందే..
మరిన్ని ఇక్కడ చదవండి :