Birthday Special: సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ హీరో.. నేడు రవితేజ పుట్టిన రోజు.. మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే..

|

Jan 26, 2022 | 10:19 AM

Ravi Teja Birthday: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ(Ravi Teaj) పుట్టినరోజు నేడు. చిన్న పాత్రలతో సినిమాల్లో అడుగుపెట్టిన రవి తేజ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగాడు. మూడు దశాబ్దాలుగా..

Birthday Special: సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ నుంచి స్టార్ హీరో.. నేడు రవితేజ పుట్టిన రోజు..  మొదటి అవకాశం ఎలా వచ్చిందంటే..
Raviteja
Follow us on

Ravi Teja Birthday: టాలీవుడ్ స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ(Ravi Teaj) పుట్టినరోజు నేడు. చిన్న పాత్రలతో సినిమాల్లో అడుగుపెట్టిన రవి తేజ స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగాడు. మూడు దశాబ్దాలుగా నటుడుగా టాలీవుడ్ (Tolly Wood) ఇండస్ట్రీలో రవి తేజ కొనసాగుతున్నాడు. రవితేజ 1968 జనవరి 26న ఆంధ్ర ప్రదేశ్‌లోని జగ్గంపేటలో జన్మించారు. పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతిరాజు. అభిమానులు ముద్దుగా ‘మాస్ మహారాజా ‘ అని పిలుచుకుంటారు. 1990లో ‘కర్తవ్యం’ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఈ సినిమా తర్వాత రవితేజ కు సినిమాల్లో గుర్తింపు ఉన్న పాత్రల్లో అవకాశాలు అంతగా దక్కలేదు. ఒక్కోసారి చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. 1996లో కృష్ణ వంశీ నిన్నే పెళ్ళాడుతా సినిమాకి రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అంతేకాదు ఆ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు.

రవి తేజ నటన బాగా నచ్చిన కృష్ణ వంశీ నెక్స్ట్ ఇయర్ ‘సింధూరం’ సినిమాలో సెకండ్ హీరో పాత్ర ఇచ్చాడు. సింధూరం సినిమా సూపర్‌హిట్‌ అయింది. ఈ చిత్రం తెలుగులో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత కూడా వివిధ సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన రవితేజ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా 1999లో ‘నీ కోసం’తో వచ్చింది. ఈ సినిమాలో రవితేజ పూర్తి స్థాయిలో హీరోగా అవకాశం అందుకున్నాడు. ఈ చిత్రానికి గానూ రవితేజకు నంది అవార్డు కూడా వచ్చింది.

ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. రవి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయాడు. దర్శకుడు జగన్నాథ్ పూరితో కలసి చేసిన ఇడియట్, అమ్మానాన్న తమిళమ్మాయి వంటి ఎన్నో హిట్ చిత్రాలకు పనిచేశాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ లాగే.. రవితేజ కూడా తన చిత్రాలలో అద్భుతమైన యాక్షన్‌తో పాటు అద్భుతమైన కామిక్ టైమింగ్‌ను ప్రదర్శిస్తాడు. 2002 మే 26న కల్యాణితో రవితేజకు వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూతురు పేరు మోక్షద, కొడుకు పేరు మహాధన్ భూపతిరాజ్. కొడుకు కూడా బాలనటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు. ఇక రవితేజ తమ్ముడు భరత్ 2017లో చనిపోయాడు. దీంతో అతని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది.

రవితేజ ‘సింధూరం’, ‘వెంకీ’, ‘డాన్ శీను’, ‘బెంగాల్ టైగర్’, ‘రాజా ది గ్రేట్’, ‘బలుపు’ వంటి పలు సూపర్ సినిమాల్లో నటించాడు. ఇక రవితేజ నటించిన పలు సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అక్షయ్ కుమార్ ‘రౌడీ రాథోడ్’ , సల్మాన్‌ఖాన్‌ ‘కిక్‌’ లు హిందీలో రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా సూపర్ హిట్ ను సొంతం చేసుకున్నాయి. రాబోయే చిత్రం ‘ఖిలాడీ’ వివిధ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాతో రవి హిందీలో అరంగేట్రం చేయబోతున్నాడు. ఇది యాక్షన్ థ్రిల్లర్ చిత్రం, ఇది 11 ఫిబ్రవరి 2022న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read:  మీరు వ్యాపారంలో సక్సెస్ సాధించాలనుకున్తున్నారా.. ఈ ఆఫీసు గదిని ఇలా అలంకరించండి..