మన్మథుడు 2 టీజర్: బాప్ రే.. నాగార్జున ఇంకా వర్జిన్ గానే ఉన్నాడా..?

|

Jun 13, 2019 | 4:28 PM

మ‌న్మ‌థుడు చిత్రంతో టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా మారిన నాగార్జున మన్మథుడు 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో టీజర్‌ను విడుదల చేశారు. టీజ‌ర్‌లోని డైలాగ్స్‌ని బ‌ట్టి చూస్తుంటే.. చాలా కాలం త‌ర్వాత నాగార్జున మళ్లీ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే… ఇంత వయసు వచ్చినా ఇంకా వర్జిన్ గానే ఉన్నావంటూ.. చుట్టూ ఉన్నవాళ్లు ఆయన్ని పెళ్లి చేసుకోమంటూ ఆటపట్టించడం లాంటి సీన్లు ఫన్నీగా చూపించారు. ఇదంతా టీజర్ ఫస్ట్ […]

మన్మథుడు 2 టీజర్: బాప్ రే.. నాగార్జున ఇంకా వర్జిన్ గానే ఉన్నాడా..?
Follow us on

మ‌న్మ‌థుడు చిత్రంతో టాలీవుడ్ మ‌న్మ‌థుడిగా మారిన నాగార్జున మన్మథుడు 2తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావడంతో టీజర్‌ను విడుదల చేశారు. టీజ‌ర్‌లోని డైలాగ్స్‌ని బ‌ట్టి చూస్తుంటే.. చాలా కాలం త‌ర్వాత నాగార్జున మళ్లీ రొమాంటిక్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. టీజర్ చూస్తే… ఇంత వయసు వచ్చినా ఇంకా వర్జిన్ గానే ఉన్నావంటూ.. చుట్టూ ఉన్నవాళ్లు ఆయన్ని పెళ్లి చేసుకోమంటూ ఆటపట్టించడం లాంటి సీన్లు ఫన్నీగా చూపించారు. ఇదంతా టీజర్ ఫస్ట్ పార్ట్‌‌లో మాత్రమే. ఇక సెకండ్ పార్ట్‌లో మన్మథుడుగా ఒరిజినల్ అవతారంలోకి వచ్చేసి అమ్మాయిలతో రొమాన్స్ చేస్తూ కనిపిస్తాడు. ఇక ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా.. ప్రముఖ నటుడు, చి.ల.సౌ చిత్రంతో డెబ్యూలోనే తొలి హిట్ అందుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. చైత‌న్ భ‌ర‌ద్వాజ్ సంగీతం అందించగా.. ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కింగ్ నాగార్జున‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ల‌క్ష్మి, వెన్నెల‌కిషోర్‌, రావు ర‌మేష్‌, నాజ‌ర్‌, ఝాన్సీ దేవ‌ద‌ర్శిని త‌దిత‌రులు ఈ చిత్రంలో నటించారు.